లక్కీ హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న రీసెంట్ గా సీతా రామం సక్సెస్ లో భాగమైంది. సీతా రామం లో రష్మిక పాత్ర గుండెలకి హత్తుకోకపోయినా.. కథలో కీలకం అవడంతో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది రష్మిక. అయితే రష్మిక గత కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈమధ్యన విజయ్ దేవరకొండ ని బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహాట్ తన షో లో రష్మిక విషయం అడగగా.. తాను నా డార్లింగ్ అంటూ సమాధానం చెప్పడం హైలెట్ గా నిలిచింది. మేమిద్దరం కెరీర్ ని ఒకేసారి స్టార్ట్ చేసాం, వరసగా రెండు సినిమాల్లో నటించడం వలన మా మధ్యన ఫ్రెండ్ షిప్ ఎక్కువగా ఉంది అని చెప్పాడు.
అటు రష్మిక కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా రష్మిక ని బాలీవుడ్ మీడియా విజయ్ దేవరకొండ తో డేటింగ్ విషయమై ప్రశ్నించింది. విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తున్నారట అని అడగగా.. దానికి రష్మిక నేనొక హీరోయిన్ ని.. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాను. మాములుగా మీరూ నేను చేస్తున్న సినిమాల గురించి అడగొచ్చు. కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? నువ్ ఎవరితో డేటింగ్ చేస్తున్నావ్? అంటూ అడుగుతారు. నా పర్సనల్ లైఫ్ మీద ఉన్న ఆసక్తి కారణంగానే ఇవన్నీ అడుగుతారు. కానీ నేను నా నోటితో నా డేటింగ్ విషయం చెప్పేవరకు నా ఎఫ్ఫైర్ వార్తలను సీరియస్ గా తీసుకోకండి, ఆ రూమర్స్ ని చదివి ఎంజాయ్ చేసేవారిని చెయ్యనియ్యండి అంటూ ఆసక్తికరంగా స్పందించింది.