బాలీవుడ్ హీరోయిన్ టబు తెలుగు వారికీ సుపరిచయమే. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి నటులతో టాలీవుడ్ లోను నటించిన టబు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తుంది. అలాగే నటనకు బ్రేక్ తీసుకోలేదు. తెలుగులో రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ లో నటించింది. ఇక బాలీవుడ్ లోను వరసగా సినిమాలు చేస్తూ ఉండే టబు ప్రస్తుతం అజయ్ దేవగన్ తో భోలా సినిమాలో నటిస్తుంది. అయితే నిన్న బుధవారం భోలా సెట్స్ లో టబు కి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.
ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో టబుకి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న టైమ్‌లో ట్రక్కు అద్దాలు పగిలి.. ట్రక్కు లోపల భాగం టబు కంటి దగ్గర గుచ్చుకుంది. అది కూడా కుడి కన్నుకి గాయమైనట్లు సమాచారం. వెంటనే మూవీ టీం ఆమెకు సెట్స్‌లో ఉన్న డాక్టర్‌తో ట్రీట్మెంట్ చేయించగా ఆ గాయానికి ఎలాంటి కుట్లు అవసరం లేదని వైద్యులు చెప్పడంతో మూవీ టీం ఊపిరిపీల్చుకుందట. ఇక హీరో అజయ్ దేవగన్ వెంటనే స్పందించి షూటింగ్ ని ఆపెయ్యగా.. డాక్టర్స్ టబు ని కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తుంది.