Advertisementt

షూటింగ్ లో విశాల్ కి తీవ్ర గాయాలు

Thu 11th Aug 2022 01:08 PM
vishal,lathi movie,mark antony movie  షూటింగ్ లో విశాల్ కి తీవ్ర గాయాలు
Vishal gets injured while shooting షూటింగ్ లో విశాల్ కి తీవ్ర గాయాలు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ కి షూటింగ్ స్పాట్ లో దెబ్బలు తగిలించుకోవడం కొత్తేమి లేదు. ఈమధ్యన సామాన్యుడు, లాఠీ సినిమా షూటింగ్స్ యాక్షన్ సీక్వెన్సెస్ లో రియాలిటీ కోసం ఎలాంటి రిస్క్ చేసేందుకైనా విశాల్ సిద్ధంగా ఉండడమే ఈ ప్రమాదాలకు కారణం. కానీ తరచూ ఇలాంటి రిస్కీ షాట్స్ తో విశాల్ ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఫాన్స్ కూడా విశాల్ కి ప్రమాదం జరిగింది అని ఆందోళన పడడం కూడా అలవాటుగా మారిపోయింది.

అయితే తాజాగా విశాల్ షూటింగ్ స్పాట్ లో మరోసారి ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. మార్క్‌ ఆంటోనీ అనే షూటింగ్ లో పాల్గొంటున్న విశాల్.. ఈరోజు అంటే గురువారం తెల్లవారుజామున ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ విశాల్ కి జరిగిన ప్రమాదం విషయం అధికారికంగా బయటికి రాకపోయేసరికి ఆయన ఫాన్స్ అసలు విశాల్ కి ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉండడమే కాదు.. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లోనే విశాల్ కి గాయాలైనట్లుగా తెలుస్తుంది.

👉 Read : విశాల్ అప్ కమింగ్ మూవీ లాఠీ టీజర్ హైలైట్స్ 

Vishal gets injured while shooting :

Vishal Injures Knee While Shooting For Mark Antony

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ