కన్నడ స్టార్ హీరో యశ్ కేజిఎఫ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రస్తుతం తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు అనుకుంటే.. యశ్ ఇంకా ఇంకా కేజిఎఫ్ లుక్ లోనే కంటిన్యూ అవడం ఆయన ఫాన్స్ లో అనుమానాలు రేకెత్తిస్తుంది. ప్రశాంత్ నీల్ తో కలిసి పాన్ ఇండియా నే షేక్ చేసిన యశ్ యాక్షన్ కి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా కెజిఎఫ్ కి నీరాజనాలు అందించారు. హిందీలో అయితే కేజిఎఫ్ బాక్సాఫీసుని బంతాట ఆడుకుంది. ఇక కేజిఎఫ్ తర్వాత యశ్ కన్నడ డైరెక్టర్ తోనే మూవీ చేయబోతున్నాడని అన్నప్పటికీ.. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇక నెక్స్ట్ మూవీ కోసం యశ్ మేకోవర్ అవుతున్నాడనే భ్రమలో ఆయన ఫాన్స్ ఉన్నారు.
ఈరోజు రక్షా బంధన్ సందర్భంగా యశ్ తన సిస్టర్ నందిని తో రాఖి కట్టించుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ పిక్స్ లో యశ్ ఇప్పటికి కేజిఎఫ్ లుక్ ని మెయింటింగ్ చేస్తున్నట్టుగా కనిపించడంతో యాష్ ఫ్యాన్స్ అయ్యో మా హీరో ఇంకా లుక్ మార్చలేదు. ఇంకా గెడ్డం, లాంగ్ హెయిర్ తో అలానే తిరుగుతున్నాడు అంటే కేజిఎఫ్ 3 కోసం రెడీ అవుతున్నాడా ఏమిటి అంటూ విస్తుపోతున్నారు. కేజిఎఫ్ ప్రమోషన్స్ టైం లో అక్టోబర్ నుడ్ని కేజిఎఫ్ 3 ఉంటే ఉండొచ్చు అంటూ మేకర్స్ చెప్పడం, యశ్ ఇంకా అదే లుక్ లో ఉండడంతో యశ్ ఫాన్స్ అనుమానాలు ఎక్కువవుతున్నాయి.