Advertisementt

NBK108 అప్ డేట్ అదిరిపోలా..

Thu 11th Aug 2022 05:59 PM
nbk108,shine screens,nandamuri balakrishna,anil ravipudi,nbk108,s thaman  NBK108 అప్ డేట్ అదిరిపోలా..
Balakrishna-Anil Ravipudi NBK108 update NBK108 అప్ డేట్ అదిరిపోలా..
Advertisement
Ads by CJ

గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి మొదటిసారి క్రేజీ కాంబినేషన్ కు సర్వం సిద్ధమైయింది. #NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు గురువారం NBK108 పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ కాంబినేషన్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.

అనిల్ రావిపూడి, థమన్ కలసిపని చేయడం ఇదే తొలిసారి. కాగా, బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ అఖండకు థమన్ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా త్వరలో బాంబార్డింగ్.. అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. అనౌన్స్ మెంట్  బిజీఎంనే అదిరిపోయిందంటే.. సినిమాలో ఏ స్థాయిలో వుంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో కలిగించారు. మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. నటసింహ నందమూరి బాలకృష్ణని మునుపెన్నడూచూడని పాత్రలో చూపించబోతున్నారు.

Balakrishna-Anil Ravipudi NBK108 update:

Shine Screens To Produce Nandamuri Balakrishna, Anil Ravipudi’s #NBK108, S Thaman On Board To Score Music

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ