Advertisementt

సురేఖ వాణి సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ

Sat 13th Aug 2022 12:52 PM
surekha vani,daughter supritha,surekha vani second marriage  సురేఖ వాణి సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ
Supritha Reacts About Her Mother Surekha Second Marriage సురేఖ వాణి సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ
Advertisement
Ads by CJ

కేరెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సినిమాల్లో ఎంత పద్దతిగా కట్టుబొట్టు విషయంలో ఉంటుందో.. బయట ఆమె చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనేంతగా ఉంటుంది. తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి, పబ్ లు, పార్టీలు, డాన్స్ లు అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చెయ్యడమే కాదు, ఈ మధ్యనే కూతురు సుప్రీత బర్త్ డే రోజున సురేఖ వాణి తన కూతురికి స్వయానా వైన్ తాగించడం హాట్ టాపిక్ గా మారింది. భర్త చనిపోయాక కూతురు తో కలిసి ఉంటూ తన టాలెంట్ ఏమిటో సోషల్ మీడియాలో చూపిస్తున్న సురేఖ వాణి సెకండ్ మ్యారేజ్ ఎప్పుడూ మీడియా కి అంతుబట్టని ప్రశ్నగానే ఉంటుంది. 

గత ఏడాది సింగర్ సునీత సెకండ్ మ్యారేజ్ తర్వాత సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అని ప్రచారం జరిగినా.. దానిని సురేఖ వాణి కొట్టి పారేసింది. తాజాగా ఆమె కూతురు సుప్రీత ని తల్లి సురేఖ వాణి సెకండ్ మ్యారేజ్ విషయం ప్రశ్నించగా.. అందుకు సుప్రీత అవుననే సమాధానం ఇచ్చింది. మా అ‍మ్మకు మళ్లీ పెళ్లి చేస్తానంటూ బదులిచ్చింది. ఇక సురేఖ వాణి కూడా మాకో బాయ్ ఫ్రెండ్ కావాలంటుంది. అతనికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటో సురేఖ చెబుతుంటే.. దానికి సుప్రీత అదేమిటి అవన్నీ ఆయనలో లేవేంటి అని అమాయకంగా అడిగేసరికి సురేఖ సుప్రీత నోరు ముయ్యడం అందరిలో ఆమెపై అనుమానాలు కలిగేలా చేసింది.

Supritha Reacts About Her Mother Surekha Second Marriage:

Surekha Vani second marriage; Daughter Supritha reaction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ