Advertisementt

షూటింగ్ లో మహేష్: సంబరపడుతున్న ఫాన్స్

Sat 13th Aug 2022 08:49 PM
sperstar mahesh babu,tvc commercial ad,hyderabad  షూటింగ్ లో మహేష్: సంబరపడుతున్న ఫాన్స్
Mahesh Babu is currently shooting for an TVC commercial షూటింగ్ లో మహేష్: సంబరపడుతున్న ఫాన్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విడుదలై మూడు నెలలు గడిచిపోయింది. మహేష్ తదుపరి మూవీ మొదలు పెట్టకుండా ఫ్యామిలీ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంటే.. ముందులో ఫాన్స్ ఆనందించినా ప్రస్తుతం ఆయన ఫాన్స్ కి మహేష్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళతారా.. త్రివిక్రమ్ తో SSMB28 ఎప్పుడు మొదలు పెడతారా.. అనే ఆత్రం పెరిగిపోతుంది. ఆగస్టు నుండి అంటూ అఫీషియల్ ప్రకటన ఇచ్చినా.. ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ నడుస్తుండడంతో.. మహేష్ ఫాన్స్ కూడా ఏం చెయ్యలేక ఊరుకున్నారు. రీసెంట్ గానే మహేష్ తన ఫ్యామిలీతో స్విజజర్లాండ్ ట్రిప్ ముగించి హైదరాబాద్ వచ్చేసారు. 

టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కారణంగా సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో మహేష్ కూడా కామ్ గానే కనిపించారు. ఈ రోజు ఉన్నట్టుండి మహేష్ బాబు షూటింగ్ స్పాట్ లో కనబడేసరికి మహేష్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే మహేష్ త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 సెట్స్ లో లేరు.. ఓ యాడ్ షూట్ కోసం ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. TVC కమర్షియల్ యాడ్ కోసం మహేష్ మేకప్ వేసుకున్నట్లుగా ఆయన సతీమణి నమ్రత ఇన్స్టాలో పోస్ట్ చెయ్యడంతో మహేష్ సెట్స్ లో షూట్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Mahesh Babu is currently shooting for an TVC commercial :

Sperstar Mahesh Babu is currently shooting for an TVC commercial in Hyderabad!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ