టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ.. అతనికి సక్సెస్ అనేది దక్కడం లేదు. హిట్ అనే పదం విని కూడా ఏళ్ళు గడిచిపోయాయి. వరస సినిమాలు చేసి హిట్ కొట్టలేకపోతున్న ఆది సాయి కుమార్ కి ఈమధ్యకాలంలో ఎంతో కొంత బజ్ వచ్చిన సినిమా తీస్ మార్ ఖాన్. ఆగష్టు 19 న ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే గత వారం విడుదలైన బింబిసార, సీత రామం, ఈ వారం విడుదలైన కార్తికేయ 2 గట్టిగా పునాదులు వేసుకున్నాయి.
అందుకు తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా రప్పిస్తున్నాయి. 19 న రాబోతున్న ఆది కి నిజంగా అగ్నిపరీక్షే. దానికో హిట్ తెచ్చుకోవడం, మూడు హిట్ సినిమాలను ఎదుర్కోవడం మాములు విషయం కాదు. అందులోను మర్కెట్ డల్ అయిన హీరో కావడంతో అతనికి ఇది పెను సవాలే అని చెప్పాలి. ఈ గండాన్ని గట్టెక్కి ఆది సాయి కుమార్ సక్సెస్ కొడతాడా? మరి తీస్ మార్ ఖాన్ తో ఆది భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది చూడాలి.