Advertisementt

బిగ్ బాస్ 6 ఓపెనింగ్ డేట్ వచ్చేసింది

Sun 14th Aug 2022 06:23 PM
bigg boss,bigg boss telugu,bigg boss 6,nagarjuna  బిగ్ బాస్ 6 ఓపెనింగ్ డేట్ వచ్చేసింది
Bigg Boss 6 opening date has arrived బిగ్ బాస్ 6 ఓపెనింగ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి ముగిసి మూడు నెలలు కావొస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి తొమ్మిదినెలలు పూర్తి కావడంతో బుల్లితెర ప్రేక్షకులు సీజన్ 6 కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 అప్ డేట్ వరసగా వదులుతుంది స్టార్ మా. గత వారమే బిగ్ బాస్ ప్రోమో తో నాగార్జున గ్రాండ్ గా బిగ్ బాస్ కమింగ్ సూన్ అంటూ చెప్పడంతో.. ఈ నెలాఖరున కానీ, సెప్టెంబర్ మొదటి వారంలో కానీ షో మొదలు పెట్టొచ్చనే ఊహాగానాలు బుల్లితెర ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు అఫీషియల్ గా స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాబోయే డేట్ ని కూడా రివీల్ చేసేసింది.

అది ఎప్పటిలాగే అంటే గత సీజన్స్ మాదిరిగానే సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ 6 మొదలు పెట్టడానికి తేదీని రెడీ చేసారు. సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ఆ ఎపిసోడ్ లోనే ఈ సీజన్6 లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ ని రివీల్ చేయబోతుంది. ఈ లోపులోనే సోషల్ మీడియాలో సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా యాంకర్ ఉదయభాను, టివి9 న్యూస్ యాంకర్, జబర్దస్త్ చంటి ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా అడుగుపెట్టబోయే ఆ క్రేజీ కంటెస్టెంట్స్ ఎవరో సెప్టెంబర్ 4 ఈవెనింగ్ కల్లా తెలిసిపోతుంది.

Bigg Boss 6 opening date has arrived:

Bigg Boss Telugu season 6 to premiere on September 4th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ