ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న రచ్చ ఇండియా వైడ్ గా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కి అంతమంది ఫాన్స్ ఉన్నారా అనిపించేంత లైగర్ ఈవెంట్స్ లో అభిమానులు చేసే హడావిడి కనిపిస్తుంది. ఒకటో, రెండో ఈవెంట్స్ కి జనం పోగేసి ప్రమోషన్స్ చేశారేమో అనుకోవచ్చు. కానీ ఏ రాష్ట్రంలో చూసినా, ఏ ఈవెంట్ లో అయినా విజయ్ దేవరకొండ కోసం ఫాన్స్ పడి చచ్చిపోతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణాలో లైగర్ ప్రమోషన్స్ లో టీం బిజీగా వుంది. నిన్న ఆదివారం సాయంత్రం వరంగల్ లో లైగర్ ఈవెంట్ నిర్వహించిన టీం నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది.
ఈ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు డాన్స్ రాదని, డాన్స్ అంటే చాలా భయమని, డాన్స్ చెయ్యడానికి చాలా కష్టపడతాను అని, ఏదో పక్కన డాన్సర్స్ ని పెట్టుకుని మ్యానేజ్ చేస్తూ ఉంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మరి లైగర్ లో విజయ్ దేవరకొండ అనన్య పాండే తో కలిసి రొమాంటిక్ గా డాన్స్ పరంగా పర్వాలేదనిపించాడు. ఇప్పుడు తనకి డాన్స్ రాదని, డాన్స్ అంటే భయమని చెబుతున్నాడు. మరి లైగర్ రిలీజ్ అయ్యాక విజయ్ డాన్స్ ని ఎలా మ్యానేజ్ చేసాడో తెలిసిపోతుంది.