యంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే NTR31 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఓపెనింగ్ అవ్వలేదు, ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అయినప్పటికీ.. NTR31 పై ట్రేడ్ లోను, ఫాన్స్ లో అంచనాలున్నాయి. ఇటు ఎన్టీఆర్ కొరటాల మూవీ కంప్లీట్ చెయ్యాలి. అటు ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ షూటింగ్ కంప్లీట్ చెయ్యాలి. అప్పుడు ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కుతోంది. కానీ అది ఎప్పుడో ప్రశాంత్ నీల్ చెప్పేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. తాజాగా ప్రశాంత్ నీల్ ని మీడియా చుట్టుముట్టింది. ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాపై ప్రశ్నల వర్షం కురిపించింది.
దానికి ప్రశాంత్ నీల్ ఏం చెప్పమంటారు. ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ కథ చెప్పంటారా అంటూ ఫన్నీ గా కామెంట్ చెయ్యడమే కాదు.. ఎన్టీఆర్ తో చెయ్యబోయే NTR31 వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ నుండి కానీ మే నుండి కానీ మొదలయ్యే ఛాన్స్ ఉంది అంటూ చెప్పి NTR31 పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. మరి ఈ రోజు ఆగష్టు 15 న ప్రశాంత్ నీల్ - ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పారు.