బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలలో ప్రభాస్ లుక్ ఫాన్స్ కి కూడా నచ్చలేదు. అలాగే ఆయన బాహుబలి కోసం పెరిగిన వెయిట్ ని తగ్గించడంలో నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ షూటింగ్స్ లో హాజరవుతూ బిజీగా వున్నారు. రాధే శ్యామ్ తర్వాత కొన్నాళ్ళు మీడియా కంటపడని ప్రభాస్ ముంబై లో ఓం రౌత్ ఇంటికి పార్టీకి వెళ్ళినప్పుడు అదిరిపోయే ఫిట్ నెస్ తో మంచి స్టైలిష్ గా కనిపించారు. అప్ప్పుడే ఫాన్స్ కి ప్రభాస్ బాగా నచ్చేసారు. ఇక రీసెంట్ గా సీతారామం ఈవెంట్ లోను ప్రభాస్ లుక్ అద్భుతః అన్న రేంజ్ లో ఉండడంతో ఆయన ఫాన్స్ కూల్ అయ్యారు.
తాజాగా ప్రభాస్ చిన్నపాటి గెడ్డం లుక్ లో చాలా అంటే చాలా హ్యాండ్ సం గా కనిపించారు. ఆయన ఏదో పర్సనల్ ఈవెంట్ కి హాజరవగా ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ షర్ట్ లో ప్రభాస్ ట్రిమ్ చేసిన గెడ్డం, కళ్ళకి స్పెట్స్, అలాగే హెయిర్ స్టయిల్ కనిపించకుండా కవర్ చేస్తూ టోపీ పెట్టుకున్న ప్రభాస్ లుక్ ని ఫాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరి మీరు ప్రభాస్ కొత్త లుక్ ని ఓసారి చూసెయ్యండి.