బాలీవుడ్ హీరోలు సౌత్ ని తలదన్నే హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సాధ్యపడడం లేదు. ఆహా ఓహో అన్న లాల్ సింగ్ చద్దా కూడా మొదటి రోజుకే బిషానా ఎత్తేసింది. అలాంటి సమయంలో సౌత్ స్టార్, పాన్ ఇండియా స్టార్ తో బాలీవుడ్ హీరో బాక్సాఫీసు ఫైట్ కి దిగితే ఆ మజానే వేరు, సౌత్ ఆడియన్స్, నార్త్ ఆడియన్స్ అని కాకుండా పాన్ ఇండియా నే టార్గెట్ చేస్తూ భీభత్సమైన క్రేజ్ తో వస్తున్న ప్రభాస్ తో, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తలపడుతున్నారు అంటే.. దానికన్నా ఇంట్రెస్టింగ్ ఫైట్ మరొకటి ఉండదు. ఇప్పుడదే జరగబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన సలార్ వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 28 న రిలీజ్ అంటూ అధికారికంగా డేట్ ఇచ్చారు.
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ కూడా అదే రోజు అంటే 2023 సెప్టెంబర్ 28 నే రిలీజ్ కాబోతుంది. మరి హృతిక్ రోషన్ ని తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. ఫైటర్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమానే. అలాంటిది ప్రభాస్ vs హృతిక్ రోషన్ అంటే చూసే జనాలకు ఇంట్రెస్ట్ గానే ఉంటుంది, కానీ మేకర్స్ కి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే. ప్రభాస్ కి నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన అభిమానం ఉంది, ప్రశాంత్ నీల్ మాస్ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన కెజిఎఫ్ రెండు పార్టులు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. అలాంటి ప్రభాస్ తో హృతిక్ తలపడడం కంటే క్రేజ్ ఏముంటుంది.