Advertisementt

షూటింగ్ లో నాజర్ కి ప్రమాదం

Wed 17th Aug 2022 09:13 PM
actor nassar,actor nassar injured,hyderabad  షూటింగ్ లో నాజర్ కి ప్రమాదం
Nassar injured during the film shoot షూటింగ్ లో నాజర్ కి ప్రమాదం
Advertisement
Ads by CJ

సినీ నటుడు, టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ కి షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చెయ్యడమే కాదు, పాన్ ఇండియా మూవీ బాహుబలి లో నాజర్ విలన్ గా అద్భుతంగా నటించి ఆహా అనిపించారు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న నాజర్ మొన్నీమధ్యనే యాక్టింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్‌ సినిమాలు వదిలేయాలని అనుకున్నారని కూడా అన్నారు.

అదలా ఉంటే హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో బుధవారం నాజర్ కి గాయాలయినట్లుగా తెలుస్తుంది. నాజర్ కి గాయాలైన వెంటనే సినిమా బృందం ఆయన్ని చికిత్స కోసం దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Nassar injured during the film shoot:

 Actor Nassar injured

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ