Advertisementt

మరికాసేపట్లో మహేష్ SSMB28 సర్ ప్రైజ్

Fri 19th Aug 2022 07:27 PM
ssmb 28 latest update,ssmb28 surprising update,mahesh babu with pooja hegde in ssmb28,mahesh babu and trivikram combo strikes again with ssmb28  మరికాసేపట్లో మహేష్ SSMB28 సర్ ప్రైజ్
SSMB28 Surprising Update Today మరికాసేపట్లో మహేష్ SSMB28 సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాటతో హిట్టు కొట్టినా మహేష్ ఇప్పటివరకు తన నెక్సెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందే లేదు.

అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టిందే లేదు.

ఈ నేపథ్యంలో మహేష్ - త్రివిక్రమ్ చేయనున్న SSMB 28 కోసం ప్రేక్షకాభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆగష్టు 9 మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తారని అంతా ఎదురు చూస్తే సింపుల్ గా ఓ పోస్టర్ తో విషెస్ చెప్పి సరిపెట్టేసారు. మొన్న ఆగష్టు 15 న షూటింగ్ షెడ్యూల్ వివరాలు వెల్లడవుతాయని వినిపించినా అదీ జరగలేదు. మొత్తానికి ఎట్టకేలకు నేడు [18-08-2022] ఆ గుడ్ న్యూస్ వినిపించారు నిర్మాత నాగవంశీ.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన ఇస్తూ... మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో, మమ్మల్ని ఎన్ని అనుకుంటున్నారో తెలుసు. ఇక కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ రోజు ఈవెనింగ్ SSMB 28 గురించి ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతోంది అంటూ ఫాన్స్ లో జోష్ తెచ్చారు.

అయితే పర్టిక్యులర్ గా ఇదీ టైమ్ అని చెప్పకపోయినా ఈ రోజు సాయంత్రానికే మహేష్ - త్రివిక్రమ్ ల మ్యాజికల్ మూవీపై అప్ డేట్ వింటామనే ఆనందం వ్యక్తమవుతోంది మహేష్ ఫ్యాన్సులో.!

సరే.. మరికాసేపట్లో ఆ SSMB 28 సర్ ప్రైజ్ ఏంటో మనమూ చూద్దాం. దానిపై చక్కగా చర్చిద్దాం. మీరు కూడా stay tuned cinejosh 🌟

SSMB28 Surprising Update Today:

Mahesh - Trivikram SSMB28 Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ