Advertisementt

ఫ్యాన్సుకి మెగా బర్త్ డే ట్రీట్ రెడీ

Thu 18th Aug 2022 01:33 PM
megastar chiranjeevi godfather telugu movie teaser releasing on august 21st 2022  ఫ్యాన్సుకి మెగా బర్త్ డే ట్రీట్ రెడీ
Chiru God Father Movie Teaser On 21-08-2022 ఫ్యాన్సుకి మెగా బర్త్ డే ట్రీట్ రెడీ
Advertisement
Ads by CJ

ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. 

గత మూడు దశాబ్దాలుగా అభిమానులు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగరోజు. 

ఈ ఏడాది కూడా మెగా బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. తాజాగా అభిమానులు తెరతీసిన ట్రెండ్ మేరకు ఆగస్ట్ 22 న చిరు ఎవర్ గ్రీన్ ఘరానా హిట్ ఘరానా మొగుడు సినిమా స్పెషల్ షోస్ స్క్రీనింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే త్వరలో రానున్న తాజా మెగా మూవీ గాడ్ ఫాదర్ టీజర్ ని కూడా చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఆగస్ట్ 21 న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ గెటప్ లో గ్రే హెయిర్ తో, సీరియస్ ఎక్స్ ప్రెషన్సుతో ఆకట్టుకుంటోన్న చిరు టోటల్ గా సాలిడ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఈసారి ష్యూర్ షాట్ హిట్ ఖాయమనే కాన్ఫిడెన్స్ ని కలిగిస్తున్నారు తన అభిమానులకి.!

ఇక ఈ మెగా గాడ్ ఫాదర్ మూవీ ఇతర విశేషాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ఈ చిత్రానికే పెద్ద ఎస్సెట్ కాబోతోంది. ముఖ్యంగా చిరు - సల్మాన్ లు కలిసి ప్రభుదేవా కొరియోగ్రఫీలో చేసిన సాంగ్ పై పెద్ద ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. చిరుకి  చెల్లెలి తరహా స్ట్రాంగ్ క్యారెక్టర్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుంది. యంగ్ హీరో సత్యదేవ్ చేస్తోన్న నెగెటివ్ రోల్ కూడా చాలా డిఫరెంటుగా వుండబోతోంది. అలాగే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో ఓ కీలక పాత్ర చేయడం మరో విశేషం.

మరిందులోని ఎవరెవరు టీజర్ లో కనిపిస్తారో.. ఏ ఏ అంశాలు మనకి కనువిందు చేస్తాయో.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వైజ్ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో వేచి చూద్దాం.

Chiru God Father Movie Teaser On 21-08-2022:

Chiranjeevi God Father Telugu Movie Teaser Releasing On 21-08-2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ