Advertisementt

ఈసారి DJ టిల్లు లీల ఇంకో రేంజ్ లో..! .

Fri 19th Aug 2022 11:20 AM
dj tillu,sreeleela,anupama parameswaran,siddu jonnalagadda  ఈసారి DJ టిల్లు లీల ఇంకో రేంజ్ లో..! .
Sreeleela To Play Female Lead In Dj Tillu 2 ఈసారి DJ టిల్లు లీల ఇంకో రేంజ్ లో..! .
Advertisement
Ads by CJ

డీజే టిల్లు మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన రొమాంటిక్ గా  రెచ్చిపోయి నెగెటివ్ టచ్ తో కనిపించిన నేహా శెట్టి ని డీజే టిల్లు సీక్వెల్ నుండి తప్పించారనే టాక్ ఉంది. డీజే టిల్లు మూవీ నుండి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, దర్శకుడూ తప్పుకున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. డీజే టిల్లు పార్ట్ 2 త్వరలోనే అంటూ నిర్మాత ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే హీరోయిన్ విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సక్సెస్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ పేరు బాగా వినిపించింది. సిద్దు కి జోడిగా అనుపమనే ఫైనల్ అని కూడా అన్నారు .

ఇప్పుడు లేటెస్ట్ గా సిద్దు జొన్నలగడ్డ హైట్ కి మ్యాచ్ అవడం, ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీలీల అయితే బావుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. పెళ్లి సందడి పెద్ద హిట్ కాకపోయినా.. సాంగ్స్ లో ఆ అమ్మాయి చేసిన డాన్స్ కి మంచి పేరు రావడమే కాదు.. తన క్యూట్ గ్లామర్ కి టాలీవుడ్ ఫిదా అయిపొయింది. దాంతో పాపకి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుస సినిమాలు చేతిలోకి వచ్చి పడ్డాయి.

ఇప్పటికే శ్రీలీల రవితేజతో సరసన చేసిన ధమాకా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. నితిన్ తో ఓ మూవీ కమిట్ అయ్యింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా శ్రీలీల చేతిలో ఉన్నాయి. అలాగే ఆల్ రెడీ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న DJ టిల్లు క్యారెక్టర్ కి శ్రీ లీల యాడ్ అయితే సీక్వెల్ క్రేజ్ డబుల్ అవుతోంది అని ఇప్పుడు మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఆ అమ్మాయిని ఫైనల్ చేసే పనిలో డీజే టీమ్ వున్నట్లుగా తెలుస్తోంది. 

Sreeleela To Play Female Lead In Dj Tillu 2:

Speculation on DJ Tillu sequel heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ