మహేష్ బాబు అక్క మంజుల తనకి బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెబుతుంది మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్. మహేష్ బాబు నమ్రత పెళ్లి విషయంలో మంజుల కీలకంగా వ్యవహరించడమే కాదు.. ఆమెతో తన రిలేషన్ షిప్ చాలా బావుంటుంది అంటూ చెబుతుంది. మహేష్ తో పెళ్ళికి ముందు మంజులతో పరిచయం ఉంది అని, ఓ పార్టీలో అనుకోకుండా మంజులని కలిసాను అని చెప్పిన నమ్రత తమ ప్రేమ విషయం అప్పటికి మంజులకి తెలియదని చెప్పింది. తర్వాత మేమంతా ఒకే ఫ్యామిలీ అయ్యాము.
మా పెళ్లిళ్ల తర్వాత మేమిద్దరం అనుకోకుండా ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాము. అయితే మొదట్లో మంజులకి పిల్లలని కనాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆమెకి ఓ కూతురు. తన కూతురు అంటే మంజులకి ప్రాణం.. అలా మంజుల నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యామని చెప్పిన మహేష్ వైఫ్.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పడం తనకేమి బాధలేదని, ప్రస్తుతం నేను ఫ్యామిలీ బాధ్యతల్లో బిజీగా వున్నాను అంటూ చెప్పుకొచ్చింది.