గత రెండు వారాలుగా బాక్సాఫీసు దగ్గర మెరుపులు, ప్రేక్షకుల కిలకిలలు సందడితో ఊపుకనిపిస్తుంది. రెండు వారాల క్రితం రిలీజ్ అయిన బింబిసారా, సీత రామం మూవీస్ మంచి హిట్స్ అవడమే కాదు, లాభాల వేటలో ఇంకా ఇంకా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉన్నాయి. ఇక గత వారం విడుదలైన మాచర్ల నియోజక వర్గం మూవీ డిసాస్టర్ అవ్వగా.. నిఖిల్ కార్తికేయ 2 సూపర్ హిట్ అయ్యింది. రెండు వారాలుగా హిట్ సినిమాలతో ప్రేక్షకుల ఆకలి తీరిపోయింది. కానీ ఈ వారం మళ్లీ బాక్సాఫీసు డల్ అయ్యింది. ఈ వారం ఓటిటి మూవీస్ కానీ, థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలేవీ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఏ సినిమా కూడా ప్రేక్షకులని థియేటర్స్ కి లాక్కొచ్చే సినిమాలు కాదు.
ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్, మాటరాని మౌనమిది ఇలా ఊరుపేర్లు లేని సినిమాలు, తమిళం నుండి ధనుష్ తిరు డబ్బింగ్ మూవీ.. ఇలా బాక్సాఫీసు బోరుమంటుంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ కోసం వెయిటింగ్ అంటున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ ఆగస్టు 25 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. లైగర్ పై ఉన్న అంచనాలు, విజయ్ దేవరకొండ క్రేజ్ అన్ని సినిమాపై హైప్ క్రియాట్ చేస్తున్నాయి. అందుకే వచ్చే గురువారం విడుదల కాబోతున్న లైగర్ కోసం రౌడీ ఫాన్స్ మాత్రమే కాదు, మిగతా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు.