Advertisementt

పరువాలను పరిచినా.. పాపం పాయల్!

Sat 20th Aug 2022 06:57 PM
payal rajput,disappoint,tees maar khan,aadi sai kumar,flop talk,payal rajput actress  పరువాలను పరిచినా.. పాపం పాయల్!
One More flop in Payal Rajput Account with Tees Maar Khan పరువాలను పరిచినా.. పాపం పాయల్!
Advertisement
Ads by CJ

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరు వినగానే ఇప్పుడంతా పాపం.. అంటూ ఆమెపై జాలి చూపిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’తో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్ని దోచిన ఈ భామ.. ఆ తర్వాత పరువాలను పరుస్తున్నా.. పట్టించుకునే హిట్ మాత్రం ఆమెకు రావడం లేదు. మధ్యలో ‘వెంకీ మామ’ అంటూ సందడి చేసే ప్రయత్నం చేసినా.. అది ఆమెకు పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆ తర్వాత ఆమె అవకాశాల కోసం వెతుక్కునే పరిస్థితికి వచ్చేసింది. చేతిలో ఉన్న రెండు అవకాశాల్లో ఒకటి.. ‘తీస్ మార్ ఖాన్’. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది కానీ.. బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్.. పాయల్ పెట్టుకున్న ఎన్నో ఆశలపై నీళ్లు చల్లేసింది. 

 

సినిమాలో హాట్ హాట్‌గా.. ఇంతకు ముందు కనిపించని విధంగా అందాలు ఆరబోసినా.. ఫలితం లేకుండా పోయింది. పాటలో పరువాలతో కవ్వించినా.. అబ్బో అదరగొట్టిందని అనిపించినా.. ఆమె పరిచిన పరువాలు, అందాలు సినిమా రిజల్ట్‌ని మార్చలేకపోయాయి. మాకు కావాల్సింది అవి కావు.. కంటెంట్ అంటూ మరోసారి ప్రేక్షకులు తిప్పి కొట్టారు. ఫలితంగా పాయల్ అకౌంట్‌లో మరో పరాజయం తప్పలేదు. ఇక ఆమె ఆశలన్నీ మంచు విష్ణు హీరోగా చేస్తున్న ‘జిన్నా’పైనే ఉన్నాయి. ఆ సినిమా అయినా హిట్టయితే.. పాయల్‌ పేరు కొన్నాళ్లు వినబడుతుంది.. లేదంటే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్స్‌కే ఆమె కూడా పరిమితమవక తప్పదు.  

One More flop in Payal Rajput Account with Tees Maar Khan:

Payal Rajput disappoints with Tees Maar Khan result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ