Advertisementt

బాలీవుడ్‌లో పరాజయాల పరంపర

Sun 21st Aug 2022 09:24 AM
taapsee,dobara,box office,bollywood,laal singh chaddha,bollywood movie,flop  బాలీవుడ్‌లో పరాజయాల పరంపర
One More flop Movie to Bollywood బాలీవుడ్‌లో పరాజయాల పరంపర
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో వరుస పరాజయాలు ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గత వారం రిలీజ్ అయిన ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షాబంధన్’ మూవీస్ ప్లాప్ లిస్ట్‌లోకి వెళ్లిపోయాయి. ఇక ఈ వారమన్నా తాప్సీ ‘దొబారా’తో హిట్ ఇస్తుంది అనుకుంటే.. అది కూడా చేతులెత్తేసింది. తాప్సీ మెయిన్ లీడ్‌లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొబారా’ సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. తాప్సీ, అనురాగ్ కశ్యప్ కూడా సినిమాని బాగా ప్రమోట్ చేసి ప్రేక్షకులల్లో ఆసక్తి క్రియేట్ చేశారు. కానీ ‘దొబారా’ కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. దానితో దాదాపు 1300 షోలు క్యాన్సిల్ చేశారు. తాప్సీ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో నార్త్ ఆడియన్స్‌కి దగ్గరైంది. అక్కడ మంచి హీరోయిన్‌గానే పేరు తెచ్చుకుంది. ఇంతకుముందు ఆమె సినిమాలకు మొదటి రోజు మినిమం కలెక్షన్స్ అందేవి.

 

కానీ ఇప్పుడు మాత్రం ‘దొబారా’ సినిమా విషయానికి వచ్చేసరికి 1 నుంచి 2 శాతం ఆక్యుపెన్సీ‌తో థియేటర్స్ కనిపించడం డిస్ట్రిబ్యూటర్లను కూడా షాక్‌కు గురి చేసింది. రెండో రోజు కూడా ఈ సినిమా పరిస్థితి అలానే ఉంది. దొబారా సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకి వచ్చిన టాక్ ప్రభావంతో కనీసం మెయిన్ సెంటర్స్‌లో కూడా ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఇక ఈ సినిమాకు జనాలు రాకపోవడంతో రెండో రోజు కూడా చాలాచోట్ల షోలను కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దీనితో బాలీవుడ్‌లో పరాజయాల పరంపర అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

One More flop Movie to Bollywood:

Taapsee Dobara also Failed at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ