Advertisementt

ఇప్పుడేంటి.. రౌడీ నిశ్చితార్థం అయినట్లేనా?

Thu 01st Sep 2022 01:30 PM
vijay devarakonda,love propose,teju,lady fan,bangalore,liger promotions,liger movie  ఇప్పుడేంటి.. రౌడీ నిశ్చితార్థం అయినట్లేనా?
Lady Fan gives sweet shock to Vijay Devarakonda ఇప్పుడేంటి.. రౌడీ నిశ్చితార్థం అయినట్లేనా?
Advertisement
Ads by CJ

‘లైగర్’ ప్రమోషన్లలో బిజీబిజీగా తిరుగుతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఓ యువతి స్వీట్ షాక్ ఇచ్చింది. ఓ ఉంగరాన్ని విజయ్ వేలికి తొడిగి.. మోకాళ్లపై నిలబడి.. ‘ఐ లవ్ యు.. విల్ యు మ్యారీ మి’ అంటూ ప్రపోజ్ చేసింది. దీంతో విజయ్ తేరుకోవడానికి కూడా కొన్ని సెకన్లు పట్టిందంటే.. ఎంతలా ఆ యువతి అతనికి షాకిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుండటంతో క్షణం తీరిక లేకుండా చిత్రాన్ని యూనిట్ ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా జరుగుతున్న టూర్‌లో ‘లైగర్’ చిత్రబృందం బెంగళూరు వెళ్లింది. అక్కడ తేజు అనే యువతి.. ఇలా రింగ్‌తో రౌడీని పడేసింది.

 

ఒక్క బెంగళూరు అనే కాదు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రౌడీ అమ్మాయిల కలల రాకుమారుడు. ఊ.. అంటే చాలు బాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్లు విజయ్ కోసం క్యూ కట్టేందుకు రెడీగా ఉన్నారు. ఆ విషయం పబ్లిక్‌గా కూడా చెప్పేస్తున్నారు. అలాగే పబ్లిక్‌లో కూడా విజయ్ లేడీ ఫాలోయింగ్ మాములుగా లేదు. ఎక్కడికి వెళ్లినా.. ఈ రౌడీ చుట్టూ అమ్మాయిలు కమ్మేస్తున్నారు.. కాకా పట్టేస్తున్నారు. పూరీ, ఛార్మీ ఒకరకంగా విజయ్‌ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కూడా అక్కడక్కడా తలెత్తుతున్నాయి. అంతలా అమ్మాయిల్లో ఈ రౌడీకి క్రేజ్ పెరిగిపోయింది. తను ఎంతగానో అభిమానించే హీరో ఒక్కసారిగా ఎదురుపడగానే.. తేజు అనే యువతి కూడా తట్టుకోలేక పోయింది. వెంటనే ఉంగరం తొడిగేసి.. ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత ఆనందం తట్టుకోలేక ఎమోషనలైంది. అలా ఎమోషనల్ అయిన ఆ యువతిని విజయ్ ఓదార్చడమే కాకుండా.. ‘లైగర్’ ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు ఆ ఉంగరాన్ని తీయనని ఆమెకు మాటిచ్చాడు. సరే, ఇదంతా బాగానే ఉందిలే కానీ.. ఇప్పుడా యువతి ఉంగరం తొడిగింది కదా.. మన రౌడీకి నిశ్చితార్థం అయిపోయిందని అనుకోవచ్చా? నిజంగా అలా అనుకుంటే.. ఇప్పుడక్కడ ఎన్ని గుండెలు ఆగిపోతాయో కదా..!

Lady Fan gives sweet shock to Vijay Devarakonda :

Lady Fan Love Propose to Vijay at Bangalore

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ