అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూటింగ్ షురూ చేసారు. ప్రస్తుతం బన్నీ ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ లో ఉన్నారు. అందుకే చిరంజీవి బర్త్ డే సెలబ్రిటీస్ లోను బన్నీ ఫ్యామిలీ పాల్గొనలేదు. సుకుమార్ అండ్ టీం మాత్రమే పుష్ప 2 పూజా కార్యక్రమాల్లో పాల్గొనింది. అమెరికా వెళ్ళిన కారణంగానే అల్లు అర్జున్ పుష్ప పూజ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే సుకుమార్ తర్వాత బన్నీ చెయ్యబోయే మూవీపై అందరిలో క్యూరియాసిటీ బాగా ఉంది. దసరా కి అల్లు అర్జున్ నుండి కొత్త సినిమా అనౌన్సమెంట్ రాబోతుంది. అది బాలీవుడ్ స్ట్రయిట్ మూవీనా.. లేదంటే మరో దర్శకుడితోనా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
కానీ తాజాగా సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ తో బన్నీ కొత్త సినిమా ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్లో మీడియా చక్కర్లు కొట్టడమే కాదు, పరశురామ్ - బన్నీ కాంబోలో రాబోయే మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఉండబోతుంది అంటూ ప్రచారం కూడా మొదలయ్యింది. అసలైతే బన్నీ కొరటాల, బోయపాటి తో సినిమా చెయ్యాల్సి ఉంది.. కానీ పరశురామ్ చెప్పిన ఈ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఉన్న స్టోరీ లైన్ నచ్చడంతో బన్నీ పరశురామ్ తో నెక్స్ట్ మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఇక పరశురామ్ - నాగ చైతన్య కాంబో మూవీ కూడా ఈ కారణంగానే పక్కకి జరిగినట్లుగా టాక్ వినిపిస్తుంది.