పెళ్ళయ్యి.. ఇద్దరి పిల్లల తల్లి అయినా అనసూయ మాత్రం అద్భుతమైన గ్లామర్ తో మెరిసిపోతుంది. జబర్దస్త్ యాంకర్ గానే కాదు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కి చిందేసిన అనసూయ ఈ మధ్యన కాస్త బొద్దుగా తయారయ్యింది. అయితే బాడీ షేమింగ్ చేసేవారిని సోషల్ మీడియాలో చీల్చి చెండాడే అనసూయ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాన్స్ ఆంటీ అంటూ ఆడేసుకుంటున్నాడు. కారణం అనసూయ విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ పై పరోక్షం గా ట్వీట్ వెయ్యడమే. అనసూయ గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ వాడిన ఓ బూతు పదాన్ని ఖండించింది. ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లకి విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ప్లాప్ టాక్ వచ్చాక ఇండైరెక్ట్ గా విజయ్ ని ఆయన ఫాన్స్ ని కెలికింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు అంటూ అనసూయ చేసిన ట్వీట్ రౌడీ ఫాన్స్ గుండెల్లో అగ్గి రాజేసింది.
అనసూయ ని రౌడీ ఫాన్స్ ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు. అది కూడా ఇలా అలా కాదు. మీమ్స్ చేస్తూ ఓ రేంజ్ లో అనసూయని టార్గెట్ చేసి నానారకాల తిట్ల తో ఆమెని దూషిస్తున్నారు. దానితో అనసూయ నన్ను ఎవరైతే దూషిస్తున్నారో.. వారి తిట్లన్నీ మీ అభిమాన హీరోల మీదకే మళ్లిస్తున్నాను, మీరు నన్ను దూషిస్తున్నారంటే మీ బుర్రలు ఖరాబై ఉండొచ్చు అని ట్వీట్ చేసిన అనసూయ, తర్వాత చెత్తని క్లీన్ చెయ్యలేక చేస్తున్నాను అంటూ మరో ట్వీట్ వేసింది. దానితో విజయ్ ఫాన్స్ మరింతగా రెచ్చిపోయి అనసూయని ఆంటీ అంటూ సంబోధిస్తూ రీ ట్వీట్స్ చెయ్యడంతో అనసూయ కూడా ఆవేశపడిపోయి బాడీ షేమింగ్ చేసేవాళ్ళని అస్సలు క్షమించను, నన్ను ఆంటీ అంటూ పిలిచిన వారి స్క్రీన్ షాట్స్ తీసుకుని పోలీస్ లకి ఫిర్యాదు చేస్తాను అనగానే.. ఆంటీ అంటే జైల్లో పెట్టిస్తాను అంటే.. ట్విట్టర్ లోని సగం మంది జైలుకెళ్లాలి అని మరో నెటిజెన్ రీ ట్వీట్ చెయ్యగా.. దానికి కూడా అనసూయ ఇక్కడ చాలా జైళ్లు అలాగే సెక్షన్స్ కూడా ఉన్నాయంటూ ట్వీట్ చేసింది. ప్రెజెంట్ ట్విట్టర్ లో #Aunty హాష్ టాగ్ ట్రేండింగ్ లో అవుతూ ఉంది.