విజయ్ దేవరకొండ కి పూరి జగన్నాథ్ లైగర్ కథ చెప్పినప్పుడు ఈ కథ పాన్ ఇండియా కి సరిపోతుంది.. అలా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో సినిమా చేద్దామని, తనతో కరణ్ జోహార్ ఎప్పటినుండో సినిమా చేయాలనుకుంటున్నాడు.. ఆయన్ని లైగర్ లో పార్టనర్ ని చేద్దామని.. పూరి జగన్నాథ్ కి సలహా ఇచ్చి పూరి ని పాన్ ఇండియా మూవీ చేసేలా చేసిన విజయ్ దేవరకొండ కి లైగర్ బిగ్ షాక్ ఇచ్చింది. సినిమా రిలీజ్ వరకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే నమ్మాడు. అలానే సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడ్డాడు. లుక్ పరంగాను, ఫిట్ నెస్ విషయంలోనూ విజయ్ దేవరకొండ ఎంతగా కష్టపడ్డాడో లైగర్ మేకోవర్ లోనే తెలుస్తుంది.
లైగర్ లుక్ ని రెండున్నరేళ్ల పాటు మోశాడు. కానీ విజయ్ దేవరకొండ అతి నమ్మకాన్ని లైగర్ నిలబెట్టుకోలేదు. సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే సినిమాకి డివైడ్ టాక్ రావడం విజయ్ దేవరకొండ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఫాన్స్ తో కలిసి సుదర్శన్ లో సినిమా చూసి బయటికి వచ్చిన విజయ్ మొహం మాడిపోయింది. అలాగే రిలీజ్ అయిన తెల్లారే పెద్దమ్మ దర్శనం చేసుకుని విజయ్ దేవరకొండ సైలెంట్ అయ్యాడు. కాకపోతే సినిమా హిట్ అయితే లైగర్ ని మరింతగా ప్రమోట్ చేసేవాడే.. కానీ టాక్ తేడా పడడంతో.. విజయ్ లైగర్ రిజల్ట్ ని విజయ్ దేవరకొండ లైట్ తీసుకున్నాడు. హిట్ అయితే సెలెబ్రేషన్స్, పార్టీ వెకేషన్స్ అంటూ రిలాక్స్ అయ్యేవాడే.. కానీ ఇప్పుడు విజయ్ తన తదుపరి మూవీస్ జన గణ మన, ఖుషి చిత్రాల కోసం రంగంలోకి దిగిపోతున్నాడు. లైగర్ రిలీజ్ అయిన రెండో రోజే జిమ్ లో కసరత్తులు స్టార్ట్ చేసి షాకిచ్చాడు.