ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ సూపర్ సక్సెస్ అవడంతో.. సీజన్ 6 కోసం యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఆదివారమే సెప్టెంబర్ 4 న మొదలు కాబోయే సీజన్ 6 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారు.. హౌస్ లో చేసే పనుల వలన వాళ్ళకి క్రేజ్ రాకపోగా.. బయటికి వచ్చేసరికి సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఇంకా ఫ్రెండ్స్ నుండి నెగెటివ్ అటాక్స్ తో డిప్రెషన్స్ లోకి వెళుతున్న విషయాన్ని గత సీజన్ కంటెస్టెంట్స్ అయిన గీత మాధురి, వితిక సెరు లు బయటపెట్టారు. హౌస్ లో మేము చేసే పనులని చూసి మామీద ఓ ఓపెనింగ్ తెచ్చేసుకుని మమ్మల్ని బాధ పెడుతున్నారంటూ వారు వాపోయారు. తాజాగా సీజన్ 2 కంటెస్టెంట్ తేజసి మడివాడ అయితే సీజన్ 2 విన్నర్ కౌశల్ ఆర్మీ వలన తాగుడికి బానిసయ్యి, డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటూ సెన్సేషనల్ గా మాట్లాడింది.
ఇక సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్లిన సింగర్ నోయెల్ కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి చెప్పమంటే.. హౌస్ లో ఇద్దరి మధ్యన ఏర్పడే గొడవల వలన ఎదుటి వాడు డిప్రెషన్ లోకి వెళతారు, అలాగే మనల్ని ఆ గొడవ డిప్రెషన్ లో పడేస్తుంది అదే బిగ్ బాస్ అంటూ చెప్పాడు. ఆ సీజన్ లో నోయెల్ అనారోగ్య కారణాల వలన చివరి వారాల్లో తనకి తానుగా బయటికి వచ్చిన విషయం తెలిసిందే. మరి బిగ్ బాస్ వలన క్రేజు, అలాగే సినిమా అవకాశాలు వస్తాయనుకుని వెళుతున్న వారు చివరికి ఇలాంటి డిప్రెషన్ మాటలు మాట్లాడుతుంటే.. బిగ్ బాస్ కి వెళితే డిప్రెషన్ తప్పదా అనే అనుమానాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.