విజయ్ దేవరకొండ నటించిన లైగర్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. విడుదలైన రోజు గట్టి ఓపెనింగ్స్ రాబట్టిన లైగర్ తర్వాత రోజు నుండి కలెక్షన్స్ పడిపోతున్నాయి. ఇప్పటికే నిఖిల్ కార్తికేయ2 కలెక్షన్స్ కన్నా లైగర్ కి తక్కువ కలెక్షన్స్ వస్తుంటే.. అప్పుడో ఆగస్టు మొదటి వారంలో విడుదలైన సీత రామం మూవీ కన్నా లైగర్ కి ఆదివారం దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. కార్తికేయ 2 ఆదివారం 16 వ రోజు ఏపీ అండ్ తెలంగాణాలో 1.55 కోట్లు కలెక్ట్ చేస్తే.. లైగర్ నాలుగో రోజు కేవలం 55 లక్షలు కలెక్ట్ చేసింది.
అంతేకాకుండా సీత రామం 24 వ రోజు ఆదివారం లైగర్ కన్నా ఎక్కువ మొత్తం లో ఆంధ్ర - తెలంగాణల్లో 93 లక్షలు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక వీకెండ్ లోనే లైగర్ పరిస్థితి అలా ఉంటే.. వీక్ డేస్ లో లైగర్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి లైగర్ సోమవారం పరీక్షలో పూర్తిగా ఫెయిల్ అయినట్లే అనిపిస్తుంది. ఇక ఏపీ - టీఎస్ లో ఆదివారం కార్తికేయ 2, లైగర్, సీత రామం, బింబిసార కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
AP+TG share on Sunday:
Karthikeya2: ₹1.55 cr (day 16)
total: ₹29.4 cr
SitaRamam: ₹93 lakhs (day 24)
Total: ₹21.2 cr
Liger: ₹55 lakhs (day 4)
Total: ₹12.7 cr
Bimbisara: ₹31 lakhs (day 24)
Total: ₹32.6 cr