Advertisementt

NBK107 సెల్ఫీ: యంగ్ లుక్ లో బాలయ్య

Tue 30th Aug 2022 03:53 PM
nandamuri balakrishna,gopichand malineni,mythri movie makers,nbk107,istanbul,turkey  NBK107 సెల్ఫీ: యంగ్ లుక్ లో బాలయ్య
NBK107 Crucial Schedule Begins In Istanbul NBK107 సెల్ఫీ: యంగ్ లుక్ లో బాలయ్య
Advertisement
Ads by CJ

 నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్ర కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్ళింది. చిత్రంలోని కీలక సన్నివేశాలు, చిత్రంలోని ప్రధానమైన నటుల మధ్యన చిత్రీకరించనున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్ లొకేషన్ నుండి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ సెల్ఫీలో బాలకృష్ణ యంగ్ లుక్స్ లో హీరోయిన్ శృతి హాసన్ ని మ్యాచ్ అయ్యేలా కనిపిస్తున్నారు. అంతేకాకుండా షూటింగ్‌ ఎక్సయిట్ మెంట్ ఈ ముగ్గురిలో కనిపిస్తోంది. టాకీ పార్ట్ మాత్రమే కాదు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.

మేకర్స్ ఇటివలే బాలకృష్ణ పుట్టినరోజున రెండు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్‌లను అందించారు. NBK107 ఫస్ట్ హంట్ వీడియో, ఆపై మాస్ పోస్టర్ విడుదల చేశారు. ఈ రెండింటికి మాస్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

NBK107 Crucial Schedule Begins In Istanbul :

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Crucial Schedule Begins In Istanbul (Turkey)

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ