లైగర్ సినిమా బావుంది.. కానీ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వలనే సినిమాకి కలెక్షన్స్ రాలేదు, పెద్ద హీరోలే స్టేజ్ పై అణిగిమణిగి వినయం చూపిస్తుంటే.. నిన్నగాక మొన్నొచ్చిన విజయ్ దేవరకొండ మాత్రం తానో పెద్ద స్టార్ లా ఫీలైపోయి.. స్టేజ్ పై నోటికి ఏదొస్తే అది మాట్లాడెయ్యడం వలనే లైగర్ సినిమా దొబ్బింది.. అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ అయ్యి గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండకి తర్వాత చెప్పునేంత హిట్ లేకపోయినా.. తన బిహేవియర్ తో రౌడీ ఫాన్స్ ని పెంచుకున్నాడు.. అది ఓకె.. కానీ సినిమా రిలీజ్ అప్పుడు ఎంతగా తగ్గి మాట్లాడితే అంతగా సినిమా కి పాజిటివ్ బజ్ వస్తుంది. చిన్న హీరో నిఖిల్ కూడా తన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటే.. విజయ్ దేవరకొండ మాత్రం తన చుట్టూ నెగిటివిటి ని పెంచుకున్నాడు.. లైగర్ ప్లాప్ కి మెయిన్ కారణం విజయ్ అంటూ చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు.
రౌడీ ఫాన్స్ ఆ విమర్శకులపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఎవరిని ఏమి అనలేదు. లైగర్ సినిమాలో దమ్ము లేకపోతే విజయ్ ఏం చేస్తాడు. సినిమాలో విజయ్ దేవరకొండ మేకోవర్, ఆయన బాడీ స్టయిల్ అన్ని విజయ్ కష్టాన్ని తెలియజేస్తున్నాయి. సినిమా మొత్తం విజయ్ దేవరకొండ పెరఫార్మెన్స్ హైలెట్ అయ్యేలా ఉంది. సినిమాలో కంటెంట్ లేకపోతె విజయ్ ఏం చేస్తాడు, ఇప్పుడు ఆయన యాటిట్యూడ్ పై చర్చలు ఎందుకు.. అసలు విజయ్ అన్న తన ఒరిజినల్ యాటిట్యూడ్ నే చూపించాడు తప్ప.. ఎక్కడా ఫేక్ యాటిట్యూడ్ చూపించలేదు. లైగర్ ఓపెనింగ్ డే అంత మంచి కలెక్షన్స్ వచ్చాయంటే.. కేవలం విజయ్ దేవరకొండ వల్లే. ఆయనకున్న అభిమానుల వల్లే. టాలీవుడ్, హిందీ, ఓవర్సీస్ ఇలా లైగర్ కి బెస్ట్ ఓపెనింగ్స్ పడడానికి విజయ్ చేసిన ప్రమోషన్స్ మాత్రమే కారణం. ఆయన అన్ని రాష్ట్రాలు తిరిగి చేసిన ప్రమోషన్స్ వలనే లైగర్ కి ఈ మాత్రం కలెక్షన్స్ అయినా వస్తున్నాయి. సినిమాలో దమ్ము లేదు కానీ.. విజయ్ దేవరకొండలో ఎలాంటి ప్రయత్న లోపం లేదు అంటూ రౌడీ ఫాన్స్ విజయ్ దేవరకొండకి అండగా నిలుస్తున్నారు.