Advertisementt

ఇలా అయితే ఓపెనింగ్స్ కష్టమే

Wed 31st Aug 2022 10:21 PM
ranga ranga vaibhavanga,jalsa shoes,pawan kalyan vs vaishnav tej  ఇలా అయితే ఓపెనింగ్స్ కష్టమే
Ranga Ranga Vaibhavanga vs Jalsa Shoes ఇలా అయితే ఓపెనింగ్స్ కష్టమే
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన లైగర్ మూవీ డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్లడం.. ఈ రోజు విడుదలైన విక్రమ్ కోబ్రా మూవీ కూడా తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రేపు శుక్రవారం రాబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో మాత్రం మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోయిన్ కేతికతో కలిసి సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. కానీ మెగా మేనల్లుడికి ఆయన మేనమావ పవన్ కళ్యాణ్ నుండి పోటీ కాదు.. రంగరంగ వైభవంగా కి డిసాస్టర్ ఓపెనింగ్స్ పడేలా కనిపిస్తున్నాయి. 

ఎందుకంటే పవన్ కళ్యాణ్ బర్త్ డే కూడా శుక్రవారమే కావడం, పవన్ బర్త్ డే స్పెషల్ గా ఆయన బ్లాక్ బస్టర్ చిత్రం జల్సా నుండి స్పెషల్ షోస్ రూపంలో మెగా మేనల్లుడికి గండం ఏర్పడింది. జల్సా షోస్ ఎక్కడ వేస్తున్నా అక్కడ హౌస్ ఫుల్ అయ్యి.. రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ ఇలా అన్ని చోట్లా సెప్టెంబర్ 2 న జల్సా హావానే నడుస్తుంది  జల్సా స్పెషల్ షోస్ తో సోషల్ మీడియాలోనూ హంగామా చేస్తున్నారు ఫాన్స్. ఆ విధంగా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా కి ఓపెనింగ్స్ దక్కడం కష్టమే. అదే సినిమా హిట్ అయితే కలెక్షన్స్ దున్నేస్తాయి.. కానీ టాక్ తేడా కొడితే విషయం మాములుగా ఉండదు. 

Ranga Ranga Vaibhavanga vs Jalsa Shoes:

Pawan Kalyan vs Vaishnav tej

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ