Advertisementt

డిసాస్టర్ సినిమాకి అమీర్ సంచలన నిర్ణయం

Thu 01st Sep 2022 10:11 AM
aamir khan,laal singh chaddha,kiran rao  డిసాస్టర్ సినిమాకి అమీర్ సంచలన నిర్ణయం
Aamir Khan returns his remuneration డిసాస్టర్ సినిమాకి అమీర్ సంచలన నిర్ణయం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తీసుకు వచ్చే అమీర్ ఖాన్ కి లాల్ సింగ్ చద్దా భారీ షాక్ ఇచ్చింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా మూవీకి తెరకెక్కింది. ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల కాగా.. ఫస్ట్ షో కే డిసాస్టర్ టాక్ రావడం, సోషల్ మీడియాలోనూ అమీర్ సినిమాపై విపరీతమైన నెగెటివిటి రావడంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. 180 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకి చివరికి 60 నుండి 70 కోట్లు రాబట్టడానికి కిందా మీదా పడింది. దానితో నిర్మాతలకి 100 కోట్ల నష్టం వచ్చింది. ఈ సినిమా కోసం అమీర్ నాలుగేళ్ళ కష్టం వృధా అయ్యింది. 

అటు డబ్బుపోయింది, ఇటు అమీర్ మరో సినిమా ఒప్పుకోకుండా ఉండిపోవడంతో నాలుగేళ్లు వృధా అయ్యాయి.  తాజాగా లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ కి బాధ్యత వహిస్తూ అమీర్ ఖాన్ తన రెమ్యునరేషన్ ని వెనక్కి ఇచ్చేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి అమీర్ 50 కోట్ల పారితోషకం తీసుకున్నారని, 100 కోట్ల నష్టానికి పరిహారంగా తాను తీసుకున్న మొత్తం రెమ్యునరేషన్ ని అమీర్ వెనక్కి ఇచ్చేశారని అంటున్నారు. 

Aamir Khan returns his remuneration:

Aamir Khan returned his remuneration for Laal Singh Chaddha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ