ఒకప్పుడు టాలీవుడ్ పెద్దగా దాసరి ఉండేవారు. ఆయనంటే భక్తితో గౌరవంతో ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు ఉండేవారు. ఏ సమస్య వచ్చినా దాసరి ఇంటికి పరిగెత్తేవారు. కానీ దాసరి నారాయణరావు గారు కాలం చేసాక ఆ బాధ్యతని చిరు మోస్తున్నారు. ఆయన వద్దన్నా, కాదన్నా చిరు నే ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు కొంతమంది. మరికొంతమంది చిరు పెద్దరికాన్ని ప్రశ్నించినా.. చిరంజీవి మాత్రం తనకి ఎలాంటి బాధ్యత వద్దంటూనే.. ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలబడుతున్నారు. అలాగే యంగ్ హీరోల ఈవెంట్స్ కి వెళ్లి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా చిరు ఓ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరు ని గెస్ట్ గా ఆహ్వానించారు సదరు నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి కూడా హుందాగానే ఆ ఈవెంట్ కి హాజరయ్యారు.
అక్కడి నుండే మొదలయ్యింది.. చిరు కాళ్ళు మొక్కే ప్రోగ్రాం. మెగాస్టార్ కనబడింది మొదలు కమెడియన్ అలీ దగ్గర నుండి ఫస్ట్ షో యూనిట్.. అలాగే అక్కడికి వచ్చిన మరికొంతమంది చిరంజీవి కాళ్ళ మీద పడుతూనే ఉన్నారు. చిరు వారిస్తున్నా ఎవరూ తగ్గలేదు. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా చిరంజీవి కాళ్ళ మీద పడిపోయారు. చిరు ని పెద్దగా భావించి కాళ్ళు మొక్కారు అది ఓకె.. కింద అలా ఉంటే.. స్టేజ్ పైకి చిరంజీవిని పిలిచి మళ్ళీ యూనిట్ మొత్తం చిరు కాళ్ళ మీద పడడమే బొద్దిగా బాగాలేదు. ఒకసారి పాదాభివందనం చేసాక.. మీడియా ముందుంది కదా అని అలా వరసగా మెగాస్టార్ కాళ్ళు పట్టుకోవడమే అందరికి నచ్ఛలేదు. ఆయన దీవెనలుంటే సక్సెస్ వస్తుంది అని నమ్మి ఆయన ఆశీస్సులు తీసుకోవడం వేరు.. ఇలా మళ్లీ మళ్లీ కాళ్ళ మీద పడడమే కొద్దిగా ఓవరేక్షన్ చేసేదిగా ఉంటే.. ఈ పనికి చిరు ఎంతగా ఇబ్బంది పది ఉంటారో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.