Advertisementt

బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరం భయ్యా

Fri 02nd Sep 2022 11:23 AM
boycott,bollywood,brahmastra,alia bhatt,karan johar  బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరం భయ్యా
BoyCott Bollywood Completely hashtag trends on Twitter బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరం భయ్యా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సినిమాల పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతుంది. ముందు సినిమాల సంగతి ఎలా ఉన్న.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే హాష్ టాగ్స్ మాత్రం బాలీవుడ్ ప్రముఖులకు కునుకు రానివ్వడం లేదు. అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. నెటిజెన్స్ ఆ సినిమాలపై విషయం కక్కుతున్నారు. సినిమా హిట్టా.. లేదంటే ఫట్టా అనే సంగతి పక్కనబెడితే.. నెగెటివ్ హాష్ టాగ్స్ మాత్రం ఆందోళన కరంగా మారాయి. రేపు 9 న రాబోయే బ్రహ్మాస్త్ర పై కొన్ని రోజులుగా #BoyCottBrahmastra హాష్ టాగ్ నిత్యం ట్విట్టర్ లో చక్కర్లుకొడుతుంది. అటు మూవీ టీం ప్రమోషన్స్ తో హడావిడి చేస్తుంటే నెటిజెన్స్ హాష్ టాగ్స్ తో హల్ చల్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 

దానితో ట్విట్టర్ లో #BoyCottBollywoodCompletely హాష్ టాగ్ తో పాటుగా #BoyCottBrahmastra హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ లో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్.. ఇలా స్టార్ కిడ్స్ సినిమాలు, సెలెబ్రిటీ సినిమాలని బాన్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. రోజు రోజుకి పరిస్థితిలో మార్పు వస్తుంది.. మారతారు అనుకుంటే.. ఈ నెగెటివిటి ఎక్కువవుతుంది తప్ప తగ్గడం లేదు. మరి అలియా-రణబీర్ ల బ్రహ్మాస్త్ర పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

BoyCott Bollywood Completely hashtag trends on Twitter:

BoyCottBrahmastra hash tag trends on Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ