Advertisementt

మేనమామ గట్టిగా దెబ్బేసాడుగా

Sat 03rd Sep 2022 08:51 PM
ranga ranga vaibhavanga,vaishnav tej,ranga ranga vaibhavanga collections  మేనమామ గట్టిగా దెబ్బేసాడుగా
Ranga Ranga Vaibhavanga day 1 collections మేనమామ గట్టిగా దెబ్బేసాడుగా
Advertisement
Ads by CJ

మేనమావ మేనల్లుడిని ఆదుకోవాల్సింది పోయి.. గట్టిగా దెబ్బేసాడుగా అంటూ నెటిజెన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తన సినిమా రంగ రంగ వైభవంగా ని ఎన్నో రిలీజ్ డేట్స్ మారుస్తూ చివరికి మేనమావ పవన్ కళ్యాణ్ బర్త్ డే కదా.. మావయ్య మీద అభిమానంతో పవన్ ఫాన్స్ థియేటర్స్ కి క్యూ కడతారు ఓపెనింగ్స్ అదిరిపోతాయని సెప్టెంబర్ 2 న రిలీజ్ డేట్ ప్రకటించాక.. అనూహ్యంగా పవన్ బర్త్ డే రోజున ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు అంటూ ఆయన పాత చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు మేకర్స్. జల్సా తో అప్పట్లో కాదు ఇప్పటికి టీవీల్లో ఓ ఊపు ఊపుతున్న పవన్ కళ్యాణ్ మరోసారి థియేటర్స్ లో రఫ్ ఆడించారు. పవన్ ఫాన్స్ పనిగట్టుకుని జల్సాని మళ్ళీ సూపర్ హిట్ చేసారు. దానితో జల్సా కి సెప్టెంబర్ 2 న 3.20 కోట్ల కలెక్షన్స్ రావడం అందరికి షాకిచ్చింది. రికార్డ్ కలెక్షన్స్ తో పవన్ ఫాన్స్ తమ స్టామినా ఏమిటో చూపించారు. 

కానీ మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ మాత్రం బుక్ అయ్యాడు. అదే సెప్టెంబర్ 2 న రంగ రంగ వైభవంగా రిలీజ్ చేస్తే వైష్ణవ్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1.5 కోట్ల షేర్ సాధించింది. అసలే సినిమాకి ఓపెనింగ్స్ లేవు.. ఇప్పుడు సినిమా కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దానితో మెగా మేనల్లుడు తెగ ఫీలైపోతుంటే.. జల్సా సినిమా షోస్ వేసి మేనల్లుడికి పవన్ కళ్యాణ్ బాగా దెబ్బేసాడు.. లేదంటే రంగ రంగ వైభవంగా సినిమాకి కనీసం ఓపెనింగ్స్ అయినా దక్కేవి.. వైష్ణవ్ కొండపొలం కన్నా రంగ రంగ వైభవంగా కలెక్షన్స్ మరింత దారుణంగా ఉన్నాయంటూ గుసగుసలాడుకుంటున్నారు.

రంగ రంగ వైభవంగా డే 1 కలెక్షన్స్ 

ఏరియా               కలెక్షన్స్

నైజాం                  50లక్షలు 

ఆంధ్రాలో             75 లక్షలు

ఇండియా వైడ్‌గా    1.25 కోట్లు 

ఓవర్సీస్               25లక్షలు

వరల్డ్ వైడ్ గా        1.5 కోట్లు షేర్

Ranga Ranga Vaibhavanga day 1 collections:

Ranga Ranga Vaibhavanga day 1 world wide collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ