Advertisementt

సమంత తో విభేదాలా.. ఎవరన్నారు

Sat 03rd Sep 2022 09:25 PM
chinmayi sripada,samantha,dubbing artist  సమంత తో విభేదాలా.. ఎవరన్నారు
Chinmayi Sripada latest comments on Samantha సమంత తో విభేదాలా.. ఎవరన్నారు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత కెరీర్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఇక సినిమా ఇండస్ట్రీలో సమంతకి చాలామందే స్నేహితులు ఉన్నారు. వారిలో శిల్పా రెడ్డి, తనకి డబ్బింగ్ చెప్పే చిన్మయి తో సమంత ఎక్కువగా ఫ్రెండ్ షిప్ చేస్తుంది. అయితే ఈ మధ్యన సమంత కి చిన్మయికి మధ్యన విభేదాలు రావడంతో ఇద్దరూ పెద్దగా కలవడం లేదనే ప్రచారం జరుగుతుంది. సమంత ఏం మాయ చేశావే సినిమా చేసేటప్పటినుండి చిన్మయి-సమంత జర్నీ కొనసాగుతుంది. సమంత కి డబ్బింగ్ చెప్పినప్పటినుండే చిన్మయి కెరీర్ టర్న్ అయ్యింది. అటు డబ్బింగ్ విషయంలో కానీ, ఇటు సమంత తో ఫ్రెండ్ షిప్ విషయంలోనూ ఆమె హైలెట్ అయ్యింది.

తాజాగా చిన్మయి ఓ ఇంటర్వ్యూ లో మట్లాడుతూ సమంత తో నేను కలవడం లేదని ఎవరు చెప్పారు, మేము కలుస్తున్నామో లేదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కలిసినప్పుడల్లా ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యలేం. తరచూ కలుస్తూనే ఉంటాం, పార్టీలకి కలిసే అటెండ్ అవుతాం.. అని అందరికి చెప్పలేం కాదు కదా. మేము ఎక్కువగా ఇంట్లోనే కలుస్తాం. ఇక సమంత చాలా మంచి వ్యక్తి. సమంత వల్లే నాకు తెలుగులో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మంచి కెరీర్‌ వచ్చింది. ఇక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆమెతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సమంత తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. ఇకపై ఫ్యూచర్ లో ఆమెకు నేను డబ్బింగ్‌ చెప్పే అవకాశం రాదేమో అంటూ చెప్పుకొచ్చింది.

Chinmayi Sripada latest comments on Samantha:

Chinmayi Sripada intresting comments on Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ