పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ ప్లాప్ మూడ్ లో నుండి బయటికి రాలేకపోతున్నారు. మరో పక్క విజయ్ పై పై హడావిడి చేస్తున్నప్పటికీ.. లోపల లైగర్ డిసాస్టర్ బాధ గుండెని పిండేస్తుంది. అటు పూరి ఇటు విజయ్ ది ఇద్దరిది ఒకే పరిస్థితి. అందుకే వాళ్ళు చేయాల్సిన జన గణ మన పై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. లైగర్ రిలీజ్ కన్నా ముందే జన గణ మన ని సెట్స్ మీదకి తీసుకొచ్చేసి హంగామా చేసేసారు. కానీ లైగర్ డిసాస్టర్ తో వారి ఆలోచనలు మారుతున్నాయనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.
కానీ ఇప్పుడు పూరి నే ఇప్పుడు జన గణ మన ని ఆపేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అనుకోవడం కాదు డిసైడ్ కూడా అయ్యిపోయారట. ఎందుకంటే లైగర్ డిసాస్టర్ తర్వాత అదే కలయికలో మరో మూవీ అంటే అంచనాలు ఉండవు. అనుకున్న క్రేజ్ రాదు, తర్వాత సినిమా బిజినెస్ కి ప్రాబ్లెమ్ అవుతుంది. అటు బడ్జెట్ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే పూరి- విజయ్ లు అన్ని విధాలుగా ఆలోచించే జన గణ మన ని ఆపెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇకపై జన గణ మన మళ్ళీ మొదలయ్యి పట్టాలెక్కే పరిస్థితి కూడా లేదంటున్నారు.