ఇప్పుడు ప్రతి సినిమా విడుదలైన ఎనిమిదివారాలకే ఓటిటిలో రిలీజ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు నిర్మాతలు. దానితో సినిమా రిలీజ్ అయ్యాక ఎనిమిదివారాల వరకు ఏ సినిమా ఓటిటికి రాదనే క్లారిటీ వచ్చేసింది. కానీ హిట్ అయినా, ప్లాప్ అయినా ఒకటే డేట్ ఫిక్స్ చెయ్యాలో లేదంటే హిట్ అయిన సినిమాలకి ఎనిమిది వారాలు, ప్లాప్ సినిమాలకు పదిహేను రోజులు ఇలాంటి ఆప్షన్స్ ఎమన్నా ఉంటాయో అనేది క్లారిటీ లేదు. ఇక గత నెల 3 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సీత రామం ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యింది అంటున్నారు. ఆగష్టు 3 న విడుదలైన సీత రామం మూవీ తెలుగు, తమిళ్, ములాయం లో బ్లాక్ బస్టర్ హిట్ అవగా.. రీసెంట్ గా హిందీలో రిలీజ్ చెయ్యగా అక్కడ కూడా సినిమాకి హిట్ రివ్యూస్ పడ్డాయి.
ఇప్పుడు సౌత్ లో థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో సీత రామం మూవీ ఓటిటికి వచ్చేస్తుంది అంటున్నారు. అది ఈ నెల 9 నుండి అంటే సీత రామం విడుదలైన 40 రోజులకి ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లే. ఈ నెల 9 నుండి సీత రామం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది.