తన విడాకుల విషయాన్ని ఇండైరెక్ట్ పోస్ట్ లతో సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సమంత.. తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా మారింది. ఒకప్పుడు గ్లామర్ పిక్స్ వదిలిన ఆమె తర్వాత పర్సనల్ లైఫ్ లో ఎంత డిస్టర్బ్ అయ్యిందో సోషల్ మీడియాలో తన పోస్ట్ లతోనే తెలియజేసింది. నాగ చైతన్య విడాకులు తర్వాత కామ్ గా ఉంటే.. సమంత మాత్రం కాస్త వైల్డ్ గానే కనిపించింది. అలాగే గ్లామర్ పరంగా ఫ్యామిలీ మాన్ లో బోల్డ్ గా కనిపించిన సామ్ డివోర్స్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మరింత డోస్ పెంచింది. గత రెండు రోజులుగా మోడీ, బిజెపి విషయంలో ట్రెండ్ అవుతున్న సమంత లేటెస్ట్ గా నటించిన సినిమాలు వరసగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అందులో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ యశోద, శాకుంతలం ఉండగా.. సమంత కొత్త ప్రాజెక్ట్స్ ని ఓకె చేసే పనిలో ఉంది.
అయితే కొన్ని కారణాల వలన సమంత సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వాలనుకుంటుందట. సోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా ఏ హీరోయిన్ పై లేని ట్రోలింగ్స్ సమంత పై నడిచాయి. అలాంటప్పుడు కూడా ఎంతో ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పిన ఆమె.. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాకి దూరంగా ఉంటే ఆమె ఫాన్స్ ఒప్పుకుంటారా? అసలు భరించగలరా? అనేది అందరిలో మొదలైన ప్రశ్న. ఇకపోతే సమంత మరో స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుందట. అదే ఇకపై సినిమాల్లో గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండాలని, కమర్షియల్ చిత్రాలు మానేసి.. హీరోయిన్ ఒరింటెడ్ మూవీస్ చెయ్యాలని అనుకోవడమే కాదు, తన దగ్గరకి వచ్చే దర్శకనిర్మాతలకు అలాంటి కండిషన్స్ పెడుతుందట సామ్. మరి లైఫ్ లో దేని గురించి గ్లామర్ ని వదలని సమంత ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక ఏం ఉందా.. అని ఆలోచిస్తున్నారు.