బిగ్ బాస్ కి వెళ్లకముందే యూట్యూబ్ లో తెగ ఫెమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్.. వెబ్ సీరీస్ లు, ఇన్స్టా రీల్స్, అలాగే డాన్స్ తోనూ హైలెట్ అయ్యాడు. బిగ్ బాస్ కి వచ్చేముందు ఓ యాక్సిడెంట్ విషయం లో ట్రోల్ అయ్యాడు. కోటి మంది ఫాలోవర్స్ ని పెంచుకోవడం కాదు, కుదురుగా ఉండాలి అంటూ చాలామంది నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. తర్వాత బిగ్ బాస్ కి వచ్చి కప్పు పట్టుకుని వెళదామనుకుంటే సిరి తో ఫ్రెండ్ షిప్ జస్వంత్ కి కప్పు రానివ్వలేదు సరికదా క్రేజు పోయేలా చేసి డీ ఫేమ్ చేసింది. బిగ్ బాస్ నుండి రాగానే గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ కి కోలుకోలేని షాకిచ్చి అతన్ని వదిలి వెళ్ళిపోయింది.
తర్వాత నెమ్మదిగా కెరీర్ లో బిజీ అయ్యాడు. కానీ అతను చేసిన ఏజెంట్ ఆనంద్ సంతోష్ అంతగా ఆకట్టుకోలేదు. ఆహా ఓటిటి సౌజన్యంతో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ షాకిచ్చింది. ఇక వరసగా వీడియోస్ చేస్తున్న షణ్ముఖ్ కి గతంలో వచ్చిన క్రేజ్ కానీ, పాపులారిటీ కానీ రావడం లేదు. అదలాఉంటే షణ్ముఖ్ ఆసుపత్రిలో చేరినట్టుగా ఓ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ పిక్ తో పాటుగా పుట్టినరోజు నెల ఇది.. దిష్టి తగిలినట్లుంది అంటూ పోస్ట్ చేసేసరికి షణ్ముఖ్ కి ఏమైందో ఏమో అంటూ ఆయన అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇక తాజాగా షణ్ముఖ్ ఓ సెల్ఫీ దిగి కొద్దిగా కోలుకున్నాను అంటూ హెల్త్ అప్ డేట్ ఇవ్వడంతో ఆయన అభిమానులు శాంతించారు.