Advertisementt

బిగ్ బాస్ 6: ఇనాయని టార్గెట్ చేసిన గీతు

Tue 06th Sep 2022 12:59 PM
bigg boss6,inayaya sulthana,galata geethu  బిగ్ బాస్ 6: ఇనాయని టార్గెట్ చేసిన గీతు
Bigg Boss 6: Galatta Geetu targets Inaya Sultana బిగ్ బాస్ 6: ఇనాయని టార్గెట్ చేసిన గీతు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారంలోనే కావాల్సిన మసాలా దట్టిస్తుంది. సీజన్ 6 మొదలైన రెండో రోజే.. హౌస్ మేట్స్ మధ్యన గొడవలు మొదలైపోయాయి. ఆ రోజే హౌస్ లో ఎమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. క్రాష్ లో ఉన్న రేవంత్, ఇనాయ, గలాటా గీతు ల లైఫ్ లో జరిగిన సాడ్ ఎమోషన్స్ ని బయటపెట్టి కీర్తి ని బాగా ఏడిపించేసారు. కీర్తి భట్ ఓ రోడ్డు ప్రమాదంలో ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పయి సింగిల్ గా ఉండడంతో.. అలాంటి ఎమోషనల్ మాటలు విన్న కీర్తి వెక్కి వెక్కి ఏడ్చింది. అదలా ఉంటే మొదటి రోజు బాత్ రూమ్ లో హెయిర్ విషయంలో గీతు కి ఇనాయ సుల్తానాకి గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగానే గీతు క్రాష్ నుండి క్లాస్ లోకి వెళ్ళాక ఇనాయ సుల్తానని టార్గెట్ చేసింది. బాలాదిత్య మాస్ లోకి వెళ్లి గీతు ని క్లాస్ లోకి పంపించాడు.

తర్వాత గీతు సోఫా మీద కూర్చుని అమ్మా ఇనాయ నా బాటిల్ ఇవ్వు. పంచదార వాటర్ లో నిమ్మాయక వేసి ఇవ్వు, అమ్మా ఆరోహి అన్నం పెట్టు, చెయ్యి కడగడానికి బౌల్ ఇవ్వు అనడమే కాకుండా ఇనాయ వాష్ ఏరియాలో ఉండగా గీతు పిలుస్తుంది అని పిలిపించుకుని ఆమెతో ఓ పాట పడమనగా.. నాకు పాట రాదు అంది. తర్వాత నా దువ్వెన తే పో అనింది గీతు.. అలా ఇనాయ సుల్తానాతో గీతు ఓ ఆట ఆడుకుంది. దానితో ఇనాయ కాస్త హార్ట్ అయినట్లుగా ఈ రోజు వదిలిన ప్రోమోలో చూపించారు. హౌస్ మేట్స్ ఇక చాలు ఆపేయ్.. బాగా కాలిపోతుంది అని గీతు కి సలహా కూడా ఇచ్చారు. ఇక గీతు క్లాస్ కేటగిరిలో ఉండి.. పడుకునే అప్షన్ ఉందా.. బాబు బాలా యాక్సెస్ కార్డు ఏది అంటూ కాస్త ఎక్కువే చేసింది కానీ.. అందులో ఎంటర్టైన్మెంట్ కనిపించింది. 

Bigg Boss 6: Galatta Geetu targets Inaya Sultana:

Bigg Boss 6: Today Promo Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ