లక్కీ గర్ల్ రష్మిక పాప గ్లామర్ తో పాటుగా అందాన్ని, అభినయాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది. తెలుగులో లక్కీ హీరోయిన్ గా దూకుడు పెంచిన రష్మిక అటు బాలీవుడ్ లో తాను నటించిన సినిమాల విడుదల నేపథ్యంలో తెగ ఎగ్జైట్ అవుతుంది. నిన్న రష్మిక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ తో కలిసి నటించిన గుడ్ బై మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి టూ మచ్ గ్లామర్ గా, బాలీవుడ్ హీరోయిన్స్ కే పోటీ ఇచ్చేస్తుందా.. అన్న రేంజ్ లో రెడీ అయ్యి వచ్చింది. క్లివేజ్ షో తో రష్మిక అందాల ఆరబోత అద్భుతః అన్నట్టుగా ఉంది. ఇక గుడ్ బై మాత్రమే కాదు సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి నటించిన మిషన్ మజ్ను కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది.
గుడ్ బై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మట్లాడుతూ అటు అమితాబ్ బచ్చన్‌తో నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ కాబోతుండటం..ఇటు అల్లు అర్జున్‌తో నటించబోతున్న పుష్ప సీక్వెల్ సెట్స్‌పైకి రాబోతుండటంతో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని చెప్పింది. అంతేకాకుండా మీరు ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి టక్కున నెగిటివిటీకి గుడ్ బై చెప్పేస్తాను.. నేను చాలా పాజిటివ్ పర్సన్ ని. ప్రపంచం మొత్తం నెగిటివిటీకి గుడ్ బై చెప్పి పాజిటివ్ తో నిండిపోవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది రష్మిక.