బిగ్ బాస్ సీజన్ 6 మొదలై మూడు రోజులు కావొస్తుంది. గత ఆదివారమే మొదలైన సీజన్ 6 లోకి ఈసారి పొలోమని 21 మంది అడుగుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ మొత్తం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇక క్లాస్ ట్రాష్ అంటూ సభ్యులు డివైడ్ అయ్యి టాస్క్ లు ఆడేసారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇదే చివరి టాస్క్.. ఫైనల్స్ కి వెళుతున్నాం అన్నట్టుగా ఆడేసారు. రేవంత్, అభినయ, ఇనాయ, నేహా చౌదరి ఇలా టాస్క్ ల్లో బెస్ట్ ఇచ్చారు. గలాటా గీతు ట్రాష్ టాస్క్ లో బాగా పెరఫార్మ్ చేసి క్లాస్ లోకి ఎంటర్ అయ్యి ఇనాయని హౌస్ మేట్స్ ని ఆడేసుకుంది. తనదైన యాస్ తో గీతు ఆకట్టుకుంటుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో బాలాదిత్య, అభినయశ్రీ, ఇనాయ లు ఉన్నారు. రేవంత్ కూడా టాస్క్ పెరఫార్మెన్సు లో ఇరగదీసాడు.
అయితే ఈవారం గలాటా గీతు నామినేషన్స్ లో ఉంటుంది అనుకున్న వారికి ఆమె ఝలక్ ఇచ్చింది. అటు ఎంటర్టైన్మెంట్ లోను, ఇటు టాస్క్ ల్లోనూ, అలాగే తన యాస్ తో ఆకట్టుకుంటుంది. అందుకే నామినేషన్స్ నుండి సేవ్ అయినా.. హౌస్ మేట్స్ మాత్రం గీతు తన టాలెంట్ తోనూ, ఏడుస్తూ సింపతీ కొట్టేసి నామినేషన్స్ నుండి సేవ్ అయ్యింది అంటూ గుసగుసలాడుకుంటుంటే.. ఈ వారం ఒంటరి పోరాటం చేస్తున్న ఇనాయ ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తుంది.