బేబమ్మ కృతి శెట్టి ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్. ఆ తర్వాత వరసగా రెండు విజయాలతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. శ్యామ్ సింగ రాయ్ లో మోడరన్ గాను బేబమ్మ లుక్స్ వైజ్ గాను, పెరఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత బంగారాజు లో ట్రెడిషనల్ వెర్ లో పద్దతిగా కనిపించింది. ఇక వారియర్ లో రామ్ పక్కన విజిల్ మహాలక్ష్మిలా కొత్త యాంగిల్ బయట పెట్టిన కృతి శెట్టి కి ఆ సినిమా తో ఫస్ట్ షాక్ తగిలింది. వారియర్ డిసాస్టర్ అవడం.. ఆ తర్వాత వచ్చిన నితిన్ మాచర్ల నియోజక వర్గం కూడా బేబమ్మ కి డిసాస్టర్ ఇవ్వడంతో.. కాస్త డీలా పడింది.
అంతలోనే ఆమె నుండి సుధీర్ బాబు తో కలిసి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం కృతి శెట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రమోషన్స్ తో బిజీగా వుంది. ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి సారి లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డీప్ నేక్ బ్లౌజ్ లో అందాలను ఆరబోస్తూ సారీ లో అదిరిపోయే ఫోజ్ ఇచ్చింది బేబమ్మ. జుట్టుని ముడివేసి.. పెద్ద పెద్ద జుంకీలతో, ఒక చేతికి బ్యాంగిల్స్ తో కృతి శెట్టి స్టయిల్ గా ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.