Advertisementt

ఈషా రెబ్బ పెళ్లిచేసుబోయే డైరెక్టర్ ఎవరబ్బా..

Thu 08th Sep 2022 10:55 AM
eesha rebba,tamil director,eesha rebba wedding  ఈషా రెబ్బ పెళ్లిచేసుబోయే డైరెక్టర్ ఎవరబ్బా..
Eesha Rebba is going to get married soon ఈషా రెబ్బ పెళ్లిచేసుబోయే డైరెక్టర్ ఎవరబ్బా..
Advertisement
Ads by CJ

అచ్చ తెలుగందం ఈషా రెబ్బా పెళ్లి పీటలెక్కబోతుందట. అందులో నిజమెంతుంతో తెలియదు కానీ.. ఈషా రెబ్బా ఓ స్టార్ డైరెక్టర్ ని వివాహం చేసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ఈషా రెబ్బా ఒకప్పుడు చాలా ట్రెడిషనల్ గా పద్దతిగా కనిపించేది. ట్రెడిషనల్ గా ఉంటే అవకాశాలు రావన్న ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ చూపించడానికి రెడీ అయ్యింది. సోషల్ మీడియాలో మోడరన్ డ్రెస్సులతో అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయినా.. ఈషా రెబ్బ కి అవకాశాలు దొరకడం లేదు. 

అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా ఆమెకి అవకాశాలు తగ్గడంతో ఫైనల్ గా పెళ్ళికి రెడీ అయినట్లుంది పాప. ఈమె ఓ తమిళ డైరెక్టర్ తో లవ్ ఉంది అని తెలుస్తుంది. ఆ తమిళ డైరెక్టర్ అక్కడ మంచి మంచి సినిమాలతో పాపులర్ అయినవాడేనట. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరువురు తమ ఫామిలీస్ కి చెప్పి ఒప్పించారని వారి పెద్దలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారి పెళ్లి ముచ్చట బయటికి రాగానే.. ఈషా రెబ్బాని పెళ్లి చేసుకోబోయే ఆ తమిళ డైరెక్టర్ ఎవరబ్బా అని ఆరాలు తీసే పనిలో పడ్డారు జనాలు. 

Eesha Rebba is going to get married soon:

Eesha Rebba who is going to marry the Tamil Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ