Advertisementt

బిగ్ బాస్ 6: సింగర్ రేవంత్ vs గలాటా గీతు

Thu 08th Sep 2022 01:51 PM
bigg boss 6,singer revanth,galatta geethu  బిగ్ బాస్ 6: సింగర్ రేవంత్ vs గలాటా గీతు
Bigg Boss 6: Singer Revanth vs Galatta geethu బిగ్ బాస్ 6: సింగర్ రేవంత్ vs గలాటా గీతు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదలైన రోజునుండి హౌస్ లో గొడవలు పడుతూ కంటెస్టెంట్స్ బుల్లితెర ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. గలాటా గీతు ఇనాయతో పడిన గొడవ బాగా హైలెట్ చేసారు బిగ్ బాస్. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మెరీనా రోహిత్ మధ్యన మంట పెట్టారు. ఇక ఈ వారం నామినేషన్స్ విషయంలో బిగ్ బాస్ హౌస్ ఫుల్ గా వేడెక్కింది. ఫైమా vs రేవంత్, చంటి vs రేవంత్, ఆరోహి vs నేహా చౌదరి.. అన్నట్టుగా ఉంటే.. ఎక్కువగా హౌస్ మేట్స్ సింగర్ రేవంత్ నే టార్గెట్ చేసినట్టుగా ఈ నామినేషన్స్ కనిపించాయి. ఇక నామినేషన్స్ లోకి వెళ్ళినవాళ్ళు ఈ ప్రక్రియ ముగిసాక కూడా అందులో నుండి బయటపడలేకపోతున్నారు.

గీతు నువ్వు ఎదుటి వాళ్ళు చెప్పింది వినవు.. నువ్ అనుకున్నదానిమీదే స్టిక్ అయ్యి ఉంటావు అని చంటి అన్నాడు. సింగర్ రేవంత్ ఎంత త్వరగా హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతే అతనికి అంత మంచిది అంటూ గలాటా గీతు రేవంత్ ని ఉద్దేశించి తన గ్రూప్ తో మాట్లాడింది. బాలాదిత్య తో ఇనాయ నేను మిమ్మల్ని ఏం అనలేదు అని ఎక్సప్లయిన్ చేస్తుండగా..బాలాదిత్య దానిని తీసుకోవడానికి రెడీ గా లేడు.. నేను ఫైట్ చెయ్యడానికి రెడీగా లేను చెల్లి అన్నాడు. నామినేషన్స్ లో పడడం పెద్ద పాపమేమి కాదు, అలాగని నువ్వేమి ఎలిమినేట్ అయ్యిపోవు. ప్రతి వారం ఎవరో ఒకరు హౌస్ నుండి వెళ్లిపోవాల్సిందే అంటూ రేవంత్ కి సర్ది చెప్పాడు బాలాదిత్య.

Bigg Boss 6: Singer Revanth vs Galatta geethu:

Bigg Boss 6: Today promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ