Advertisementt

‘జిన్నా’ టీజర్: మంచు టైమ్ స్టార్టయిందా?

Sun 11th Sep 2022 01:32 PM
manchu vishnu,ginna,ginnateaser,ginna teaser talk,ginna teaser review,payal rajput,sunny leone  ‘జిన్నా’ టీజర్: మంచు టైమ్ స్టార్టయిందా?
Vishnu Manchu Starring Ginna Teaser Talk ‘జిన్నా’ టీజర్: మంచు టైమ్ స్టార్టయిందా?
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీ హీరోలకు అర్జెంట్‌గా ఒక హిట్టు కావాలి.. లేదంటే ఆ ఫ్యామిలీ మనుగడే ఇండస్ట్రీలో కష్టం అనేలా పరిస్థితులు మారిపోయాయి. ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాతో బీభత్సమైన ట్రోలింగ్‌కి గురైన మంచు ఫ్యామిలీ.. ఇప్పుడా ట్రోలర్స్‌ని షాకిచ్చే హిట్టుతో కొట్టాలి. షాకేమో కానీ.. భయపట్టడం మాత్రం ఖాయం అనేలా.. ఇప్పుడొచ్చిన మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ ఉంది. మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా.. శృంగార తార సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. అక్టోబర్‌లో విడుదలకానున్న ఈ చిత్ర టీజర్‌ని శుక్రవారం గ్రాండ్‌గా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనబడుతోంది. మరి ఈ సినిమా అయినా.. మంచు ఫ్యామిలీ పరువును నిలబెడుతుందో.. లేదో తెలియాలంటే మాత్రం అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

 

టీజర్ విషయానికి వస్తే.. స్టార్టింగ్ కలర్‌ఫుల్ షాట్స్‌తో మొదలైన ఈ టీజర్.. తర్వాత హర్రర్ కథాంశం వైపు నడిచింది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ చిత్రమనేలా ముగింపుకు వచ్చేసరికి అర్థమవుతుంది. ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా’ తర్వాత ఆ తరహా చిత్రం మంచు ఫ్యామిలీ నుండి రాలేదు. ఈ టీజర్ చూస్తుంటే.. ఇది ఆ తరహా చిత్రమనే అర్థమవుతుంది. మంచు విష్ణు కూడా ఈ సినిమాలో కాస్త వెరైటీగా నటించినట్లుగా తెలుస్తుంది. పాయల్‌కి టీజర్‌లో పెద్దగా స్కోప్ ఇవ్వలేదు కానీ.. మెయిన్ కథాంశం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందా? అనేలా అయితే ఈ టీజర్ హింట్ ఇచ్చింది.

 

‘‘పెళ్లి ధూమ్ థామ్‌గా చేస్తున్నావు.. వంటోళ్లు యాడనుంచి.. అని రఘుబాబు అడుగుతున్న డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్.. జిన్నా టెంట్ హౌస్ అనగానే అంతా షాకవడంతో.. జిన్నాది కాస్త డిఫరెంట్ పాత్రలా రివీల్ చేశారు. వెంటనే, ఆ పాత్రకి సంబంధించి ఇంకాస్త ఇంట్రడక్షన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ‘వాడు టైమ్‌కే వస్తాడు.. వచ్చేటప్పుడు బ్యాడ్ టైమ్ కూడా తీసుకువస్తాడు కదా..’ అని అనగానే పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న సునీల్ తలపై కొబ్బరిబొండాం పడటం.. ఆ వెంటనే ‘పొట్టన పెట్టుకున్నావ్ కదరా’ అని రఘుబాబు అనడం చూస్తుంటే.. జిన్నా పాత్ర వెనుక బ్యాడ్ ఎంత ఉందనేది క్లారిటీ ఇచ్చేశారు. అది చాలదన్నట్లు.. ‘ఆడుత్త పనికిమాలినోడు.. పైగా ఊరినిండా అప్పులు’ అని నరేష్ చెప్పే డైలాగ్‌తో.. జిన్నా బ్యాక్‌గ్రౌండ్ బద్దలు చేశారు. ఈ ఇంట్రడక్షన్ అయ్యాక.. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఉండే కేశవ వాయిస్‌లో.. మంచు విష్ణు డైలాగ్ డెలివరీని పరిచయం చేశారు. తనకున్న అప్పులు తీరాలంటే.. లక్ష్మీదేవి పచ్చ బస్సెక్కి నేరుగా రంగంపేటలో దిగాల్సిందే.. అని జిన్నా చెప్పే డైలాగ్ తర్వాత.. సన్నీలియోన్ ఎంట్రీని ఆ పేరుకు తగ్గట్టుగానే దించారు. ఆ వెంటనే జిన్నా టైమ్ స్టార్టయిందంటూ.. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఉన్న పరిస్థితుల్లో మార్పు రాబోతుందనేలా ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇక అక్కడి నుండి టీజర్ మరో మలుపు తీసుకుంది. హర్రర్ అంశాలతో టీజర్‌ని నింపేశారు. ఇటువంటి హర్రర్ అంశాలు కొత్తేం కాదు.. కానీ మంచు విష్ణు ఈ జోనర్ టచ్ చేయడమే ఇక్కడ కొత్త అంశం. సినిమా కథని, కాన్సెఫ్ట్‌ని కాస్త పేరున్నవారే తయారు చేశారు కాబట్టి.. ఈ జోనర్ విష్ణుకి ఫస్ట్ టైమ్ కాబట్టి.. హిట్టు కొట్టే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ప్రస్తుతం ఈ టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. 

టీజర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Vishnu Manchu Starring Ginna Teaser Talk:

Manchu Vishnu and Payal Rajput Acted Ginna Teaser Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ