ఏమాటకామాటే చెప్పుకోవాలి.. బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటినుండే బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ చాలా చప్పగా డల్ గా ఉండేవారు. కానీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఫైర్ మీదున్నారు. ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లోనే ఘోరంగా గొడవ పడిపోయారు. కెప్టెన్ కావడానికి ఇదే లాస్ట్ వారమా అన్నట్టుగా తన్నుకున్నారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గీతూ పై సంచాలక్ ఫైమా అరిసేసింది. అలాగే మిగతా హౌస్ మేట్స్ కూడా గీతు కి యాంటీ అయ్యారు. రేవంత్ పై ఉన్న నెగిటివిటి మరోసారి ఈ టాస్క్ లో కనిపించింది. అయితే కెప్టెన్సీ టాస్క్ ముగిసాక బిగ్ బాస్ ఈ వారం వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పమని, దానికి రీజన్స్ చెప్పమని అడిగారు. వారిని బిగ్ బాస్ జైలుకి పంపిస్తాడు.
ఈ వరెస్ట్ కంటెస్టెంట్ ఎంపికలో హౌస్ మేట్స్ చాలామంది గలాటా గీతూ నే టార్గెట్ చేసారు. ప్రతి ఒక్కరూ తాము ఎవరిని వరెస్ట్ కంటెండర్ అనుకుంటున్నారో మొహం మీద స్టాంప్ వేసి చెప్పాలి. అలా ఎక్కువ స్టాంప్స్ గీతు కి వేసినట్టుగా తాజాగా వదిలిన ప్రోమో చూపించారు. గీతూ కెప్టెన్సీ టాస్క్ లో ఆడిన ఆట తీరు నచ్ఛలేదు అని, తాను చెప్పిందే కరెక్ట్ అనే రీతిలో ఆమె ఉంటుంది అని చెప్పారు. రేవంత్ vs ఆది రెడ్డి అన్న రేంజ్ లో ఫైట్ జరగగా.. బాలాదిత్యకి ఇనాయ కి గొడవ జరిగింది. ఇక ఇనాయ శ్రీహాన్ ని ఉద్దేశించి నీకు సిరి ఉంది చాలామంది ఉనాన్రు అనగానే.. బయట ఉన్నవారి గురించి మాట్లాడొద్దు అన్నాడు శ్రీహన్. కానీ నువ్వు అందరితో మంచిగా ఉండాలని డిసైడ్ అయ్యావ్ అంటూ శ్రీహన్ ని ఇనాయ టార్గెట్ చేసింది.