హైపర్ ఆది కొన్నాళ్లుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. తన పంచ్ లతో జెడ్జెస్ తో శెభాష్ అనిపించుకోవడమే కాదు, ప్రతి వారం తన టీం తో కలిసి అదిరిపోయే కామెడీతో స్కిట్స్ తో అలరించి ఇమేజ్ ని సొంతం చేసుకునేవాడు. అయితే జబర్దస్త్ నుండి జెడ్జ్ రోజా తప్పుకునే ముందే హైపర్ ఆది జబర్దస్త్ కి రావడం మానేసాడు. అప్పుడు హైపర్ ఆది పారితోషకం కారణంగానే జబర్దస్త్ వదిలేసాడనే ప్రచారం జరిగింది. తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చాను, సినిమా లకు చేస్తున్న వర్క్ వలన జబర్దస్త్ కి వెళ్లలేకపోతున్నా, టైం కుదరడం లేదు, అందుకే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు.
సమయం లేకపోబట్టే బ్రేక్ తీసుకున్నాను, అంతేకాని జబర్దస్త్ మానలేదు, మళ్ళీ వస్తా అని చెప్పినట్టుగానే హైపర్ ఆది జబర్దస్త్ కి జబర్దస్త్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్యనే ఆది స్కిట్ లోకి ఎంటర్ అయిన రాము హైపర్ ఆదికి ఘనంగా స్వాగతం పలికాడు. ఆది కూడా రాయల్ గా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ ఇది జబర్దస్త్ లా లేదు, ఏదో పొలిటికల్ టూర్ లా ఉంది అంటూ బిల్డప్ ఇచ్చాడు. ఇక జబర్దస్త్ లోకి ఆది మళ్ళీ రావడం పై ఇంద్రజ చాలా హ్యాపీ గా ఫీలైనట్టుగా ప్రోమోలో చూపించారు. మరి ఈ గురువారం కామెడీ ప్రియులకి హైపర్ ఆది స్కిట్ తో ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట.