Advertisementt

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్

Tue 13th Sep 2022 09:06 PM
mrunal thakur,sita ramam movie,wedding  పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్
Mrunal Thakur makes shocking comments on marriage పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్
Advertisement
Ads by CJ

సీత రామంలో సీత పాత్రకే అందం తెచ్చిన మృణాల్ ఠాకూర్.. ఆ సినిమాలో ముస్లిం యువతిగా, హిందూ స్త్రీ గా లుక్స్ విషయంలో అద్భుతంగా కనిపించింది. దుల్కర్ సల్మాన్ తో రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ లోను ఆమె పెరఫార్మెన్స్ కి పేరు పెట్టేవారు లేరు. అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసిన మృణాల్ ఠాకూర్ సీత రామం తో హిందీ ఆడియన్స్ ని పడేసింది. అన్ని భాషల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. మృణాల్ కి వరసగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అయితే తాజాగా ఆమె ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో అనే విషయంపై ఆసక్తికరంగా స్పందించింది. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. లేదంటే లేదు అంటుంది.

నా ప్రోఫెషన్ ని, నా మనసుని అర్ధం చేసుకునేవాడు, నా కెరీర్ ని గౌరవించేవాడు నా లైఫ్ పార్టనర్ గా రావాలని కోరుకుంటున్నాను. మన చుట్టూ చాలా అభద్రత ఉంది.. నాకు రక్షణ కల్పించేవాడు నాకు దొరకాలి. అది అంత ఈజీ కాదు. అలాంటి వాడు దొరికితే ఒకే.. లేదంటే పెళ్లి మాత్రం చేసుకోను అని సంచలనంగా మాట్లాడింది మృణాల్ ఠాకూర్. అంతేకాకుండా పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ సమాజంలో ఓ స్త్రీకి పెళ్లి, పిల్లలు విషయంలో చాలా రెస్టక్షన్స్ ఉంటాయి. పెళ్లి చేసుకోకపోయినా.. నేను తల్లినవుతాను. అది కూడా సరోగసి పద్దతి ద్వారా బిడ్డను కంటాను. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్ ట్యూబ్ పద్డతి ద్వారా బిడ్డను కంటాను అంటే మా అమ్మ కూడా ఒప్పుకుంది.. అంటూ మృణాల్ పెళ్లి, పిల్లల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

Mrunal Thakur makes shocking comments on marriage:

Mrunal Thakur Shocking Comments On Marriage And Children

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ