సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘SSMB28’ చిత్ర షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎన్ని రూమర్స్ వచ్చాయో, వినిపించాయో తెలియంది కాదు. ఆ రూమర్స్‌కి తగ్గట్టే.. ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు, ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ ఓ వీడియోని విడుదల చేయడమే కాకుండా.. ‘#SSMB28ఆరంభం’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా వదిలారు. ఈ హ్యాష్ ట్యాగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఈ హ్యాష్ ట్యాగే టైటిల్ హింట్ కూడా ఇచ్చేసిందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడస్తుండటం విశేషం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చాలా వరకు సినిమాలు ‘అ’, లేదంటే ‘ఆ’తోనే మొదలవుతాయి. ఆయన ఈ ‘అఆ’ల సెంటిమెంట్‌ని గత కొన్ని చిత్రాల నుండి ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుతో ‘అతడు’, ‘ఖలేజా’ అనే చిత్రాలను డైరెక్ట్ చేసినా.. ఆ తర్వాత ఆయన చేసిన అన్ని చిత్రాలకు మ్యాగ్జిమమ్ ‘అఆ’ల సెంటిమెంట్‌నే ఫాలో అయ్యారు. ఇంతకుముందు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం విషయంలో కూడా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. ఇప్పుడు మహేష్‌తో చేసే చిత్రానికి కూడా టైటిల్ ‘ఆ’తోనే ఉంటుందనేలానే కాకుండా.. ‘#SSMB28ఆరంభం’ అంటూ.. ‘ఆరంభం’ అనేది ఈ చిత్రానికి టైటిల్ కాబట్టే.. ఇలా వారు హ్యాష్ ట్యాగ్ వదిలారనేలా ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా.. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్ సెంటిమెంట్ ఫాలో అయితే.. మ్యాగ్జిమమ్ ఇదే.. టైటిల్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి చివరికి ఇదే టైటిల్ అవుతుందా.. లేదంటే ఇంకో పవర్ ఫుల్ టైటిల్‌ని ఏమైనా ఫిక్స్ చేస్తారా?.. తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయక తప్పదు.